Indian Navy : ఆయిల్ ట్యాంకర్ అగ్నిప్రమాదం: ఐఎన్ఎస్ తబార్ సకాలంలో స్పందన, భారత సిబ్బందికి రక్షణ:గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో భారీ అగ్నిప్రమాదానికి గురైన ఓ ఆయిల్ ట్యాంకర్‌కు భారత నౌకాదళం తక్షణ సహాయం అందించింది. ప్రమాదంలో చిక్కుకున్న 14 మంది భారతీయ సిబ్బందిని రక్షించేందుకు ఐఎన్ఎస్ తబార్ నౌక వేగంగా స్పందించింది.
గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో భారత నావికాదళం సాహసం: 14 మంది భారతీయ సిబ్బంది రక్షణ
గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో భారీ అగ్నిప్రమాదానికి గురైన ఓ ఆయిల్ ట్యాంకర్‌కు భారత నౌకాదళం తక్షణ సహాయం అందించింది. ప్రమాదంలో చిక్కుకున్న 14 మంది భారతీయ సిబ్బందిని రక్షించేందుకు ఐఎన్ఎస్ తబార్ నౌక వేగంగా స్పందించింది.
పలావుకు చెందిన ‘ఎంటీ యీ చెంగ్ 6’ అనే ఆయిల్ ట్యాంకర్, కాండ్లా నుంచి ఒమన్‌లోని షినాస్‌కు వెళ్తుండగా గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఇంజిన్ రూమ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో నౌకలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి, సముద్రంలో నిస్సహాయంగా ఆగిపోయింది. ఆ సమయంలో ట్యాంకర్లో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు.
ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ట్యాంకర్ సిబ్బంది అత్యవసర సహాయం కోరగా, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో మిషన్‌లో ఉన్న భారత నౌకాదళ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తబార్‌కు ఈ సమాచారం అందింది. ప్రమాద తీవ్రతను గ్రహించిన ఐఎన్ఎస్ తబార్ సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ ఘటనపై భారత నౌకాదళం స్పందిస్తూ, “గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో విధుల్లో ఉన్న మా ఐఎన్ఎస్ తబార్ నౌక నిన్న ఎంటీ యీ చెంగ్ 6 నుంచి వచ్చిన అత్యవసర సందేశానికి స్పందించింది. భారత్ నుంచి ఒమన్ వెళ్తున్న ఈ నౌకలో 14 మంది భారత సిబ్బంది ఉన్నారని, ఇంజిన్ రూమ్‌లో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగిందని వివరించింది. ఐఎన్ఎస్ తబార్ నౌక సకాలంలో స్పందించి, ట్యాంకర్‌లోని సిబ్బందికి అవసరమైన సహాయాన్ని అందించింది” అని తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Read also:Narayana : మంత్రి నారాయణ సంచలన ఆరోపణలు: గత ప్రభుత్వం రూ. 3 వేల కోట్లు మాయం
