KTR : కేటీఆర్ బ్రిటన్ పర్యటన: ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరంలో కీలక ప్రసంగం:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉదయం బ్రిటన్ పర్యటనకు బయలుదేరారు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో జూన్ 20, 21 తేదీల్లో జరగనున్న ‘ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం 2025’ సదస్సులో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించనున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బ్రిటన్ పర్యటన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉదయం బ్రిటన్ పర్యటనకు బయలుదేరారు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో జూన్ 20, 21 తేదీల్లో జరగనున్న ‘ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం 2025′ సదస్సులో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించనున్నారు. భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ అనే ప్రధాన అంశంపై ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సదస్సులో కేటీఆర్, తెలంగాణ
రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి గతంలో తీసుకున్న చర్యలు, రాష్ట్ర అభివృద్ధి కోసం అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ప్రజా సేవలను మెరుగుపరచడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకున్నారనే అంశాలపై మాట్లాడతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు, పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు ఈ సదస్సులో పాల్గొంటారు. సాంకేతికత ద్వారా భారతదేశం సుస్థిర అభివృద్ధిని ఎలా సాధించగలదనే విషయంపై ఇందులో విస్తృతంగా చర్చిస్తారు. కేటీఆర్ తన పర్యటన ముగించుకుని జూన్ 24న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
Read also:Israel-Iran : ఇజ్రాయెల్ నుండి ఇరాన్‌కు షాకింగ్ వార్నింగ్: ఖమేనీని టార్గెట్ చేసిన కాట్జ్