AnilRavipudi : దిల్ రాజు ‘రన్నింగ్ రాజు’: అనిల్ రావిపూడి ప్రశంసలు – కొత్త వేదిక దిల్ రాజు డ్రీమ్స్:ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, అగ్ర నిర్మాత దిల్ రాజుపై ప్రశంసలు కురిపించారు. దిల్ రాజు కొత్తగా ప్రారంభించనున్న ‘దిల్ రాజు డ్రీమ్స్’ వేదికనుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అనిల్ రావిపూడి ప్రశంసలు – ‘రన్నింగ్ రాజు’గా దిల్ రాజు!
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, అగ్ర నిర్మాత దిల్ రాజుపై ప్రశంసలు కురిపించారు. దిల్ రాజు కొత్తగా ప్రారంభించనున్న ‘దిల్ రాజు డ్రీమ్స్’ వేదికనుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో దిల్ రాజు ఈ కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించడంపై అనిల్ రావిపూడి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అనిల్ రావిపూడి విడుదల చేసిన వీడియో సందేశంలో, దిల్ రాజుతో తన పదేళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. “పటాస్ సినిమా తర్వాత ఆయనతో సుప్రీమ్ చేశాను. దిల్ రాజు ఎప్పుడూ ఒకే చోట ఆగరు. నిరంతరం ఏదో ఒక కొత్తదనం కోసం పరిగెడుతూనే ఉంటారు. అందుకే ఆయనకు దిల్ రాజు అని కాకుండా ‘రన్నింగ్ రాజు’ అని పేరు పెడితే బాగుంటుంది” అని తనదైన శైలిలో చమత్కరించారు.
చిత్ర పరిశ్రమలో వివిధ జానర్ల సినిమాలను నిర్మిస్తున్న దిల్ రాజు, ఇప్పుడు కొత్త వారికి అవకాశం కల్పించేందుకు ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే వేదికను ముందుకు తీసుకువస్తున్నారు. “కొత్త వారి ఐడియాలను గుర్తించి, వారిని ప్రోత్సహించాలనేది దిల్ రాజు గారి మంచి ఆలోచన. ఈ ప్రయత్నం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అనిల్ రావిపూడి శుభాకాంక్షలు తెలిపారు.
దిల్ రాజు డ్రీమ్స్ వెబ్సైట్ ఈ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో జరగనుంది. ఈ వెబ్సైట్ లాంచింగ్ ఈవెంట్కు యంగ్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
