Nitin Gadkari : ద్విచక్ర వాహనాలకు టోల్ లేదు :కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం:ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేస్తారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టతనిచ్చారు. ఈ ప్రచారంలో ఎటువంటి నిజం లేదని ఆయన గురువారం వెల్లడించారు. ద్విచక్ర వాహనాల నుంచి టోల్ రుసుము వసూలు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన ఖండించారు.
బైకులకు టోల్ ఫీజు వసూలు వార్తలు అవాస్తవం: గడ్కరీ
ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేస్తారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టతనిచ్చారు. ఈ ప్రచారంలో ఎటువంటి నిజం లేదని ఆయన గురువారం వెల్లడించారు. ద్విచక్ర వాహనాల నుంచి టోల్ రుసుము వసూలు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన ఖండించారు.
జులై 15వ తేదీ నుంచి ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ ట్యాక్స్ అమల్లోకి రానుందంటూ సామాజిక మాధ్యమాల్లో, కొన్ని వార్తా సంస్థల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో గడ్కరీ వివరణ ఇచ్చారు.
“ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. ప్రస్తుతం ఉన్న విధంగానే వాటికి టోల్ పన్ను నుంచి పూర్తి మినహాయింపు కొనసాగుతుంది” అని ఆయన పేర్కొన్నారు. వాస్తవాలు నిర్ధారించుకోకుండా కొన్ని మీడియా సంస్థలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా వార్తలను ప్రసారం చేయడం సరికాదని, ఇలాంటి నిరాధారమైన వార్తల వల్ల ప్రజల్లో అనవసర ఆందోళన నెలకొంటుందని ఆయన అన్నారు.
కేంద్ర మంత్రి ప్రకటనకు అనుగుణంగానే, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) కూడా ఈ విషయంపై ఒక ప్రకటన విడుదల చేసింది. ద్విచక్ర వాహనాలకు టోల్ రుసుము విధించే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని ఎన్హెచ్ఏఐ స్పష్టం చేసింది. కాబట్టి, జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనదారులు ఎలాంటి టోల్ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న నిబంధనలే కొనసాగుతాయని స్పష్టమవుతోంది.
Read also:Kannappa : కన్నప్ప’ కథకు మంచు విష్ణు పునర్జన్మ
