Praneeth Rao :ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈరోజు (శుక్రవారం) ప్రణీత్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. గతంలో ప్రణీత్ రావును సిట్ పలుమార్లు ప్రశ్నించింది. హార్డ్ డిస్క్‌ల ధ్వంసం, ఆధారాలు మాయం చేయడంలో ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు: కొనసాగుతున్న సిట్ దర్యాప్తు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈరోజు (శుక్రవారం) ప్రణీత్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. గతంలో ప్రణీత్ రావును సిట్ పలుమార్లు ప్రశ్నించింది. హార్డ్ డిస్క్‌ల ధ్వంసం, ఆధారాలు మాయం చేయడంలో ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజు రాత్రి ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన పరికరాలు, హార్డ్ డిస్క్‌లను ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. ఎస్ఐబీ కార్యాలయంలోనే హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసి మూసీ నదిలో పడవేశారు. ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు మూసీ నది నుంచి కొన్ని హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రభాకర్ రావు విచారణలో ప్రతిష్టంభన
ఈ కేసులో సిట్ అధికారులు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కూడా విచారిస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని సిట్ వర్గాలు తెలిపాయి. ఫోన్ ట్యాపింగ్ చేయమని తాను ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదని ఆయన చెబుతున్నారు. అయితే, ప్రణీత్ రావుతో పాటు అరెస్టయిన తిరుపతి రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు వంటి ఇతర నిందితులు, ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే పని చేశామని గతంలో ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లలో పేర్కొన్నారు.
ప్రభాకర్ రావు స్టేట్మెంట్లను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, సిట్ ప్రణీత్ రావును మరోసారి విచారించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసే అవకాశం ఉంది. రేపు ప్రభాకర్ రావును మరోసారి విచారణకు రావాల్సిందిగా సిట్ నోటీసులు జారీ చేసింది. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును కలిపి విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.
