Helth : గులాబీ టీ: ఆరోగ్యం మీ చేతుల్లో!

Rose Tea: A Healthy Alternative to Caffeine

Helth : గులాబీ టీ: ఆరోగ్యం మీ చేతుల్లో:చాలామంది ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగడానికి అలవాటు పడతారు. రోజులో అనేకసార్లు ఈ అలవాటు కొనసాగుతుంది. అయితే వీటిలో ఉండే కెఫీన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కెఫీన్‌కు బదులుగా గులాబీ టీ

చాలామంది ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగడానికి అలవాటు పడతారు. రోజులో అనేకసార్లు ఈ అలవాటు కొనసాగుతుంది. అయితే వీటిలో ఉండే కెఫీన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కెఫీన్ లేని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ‘గులాబీ టీ’ (రోజ్ టీ) మంచి ఎంపిక అని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. ఎండబెట్టిన గులాబీ రేకులతో తయారుచేసే ఈ టీని రోజుకు రెండు కప్పులు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వారు చెబుతున్నారు.

ఎండబెట్టిన గులాబీ రేకులతో చేసే ఈ టీలో పాలీఫినాల్స్, ఆంథోసైనిన్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి, కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనివల్ల గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.

అలాగే రోజ్ టీ సహజసిద్ధమైన లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. దీనివల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. కాలేయంలోని వ్యర్థాలను బయటకు పంపడంలోనూ ఇది సహాయపడుతుంది.గులాబీ రేకుల్లో విటమిన్ సి అధిక మోతాదులో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పటిష్ఠం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫలితంగా జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు.

ఈ టీలో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని నొప్పులు, వాపులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి (ఆర్థరైటిస్) ఇది కొంత ఉపశమనం కలిగిస్తుంది. గొంతు నొప్పి, గరగర వంటి సమస్యలకు కూడా ఇది మంచి మందుగా పనిచేస్తుంది.

మహిళలు ఎదుర్కొనే రుతుక్రమ సమస్యలకు గులాబీ టీ చక్కటి పరిష్కారం చూపుతుంది. రుతుస్రావ సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించడంలో దీనిలోని యాంటీ-స్పాస్మోడిక్ గుణాలు సహాయపడతాయి. క్రమం తప్పకుండా ఈ టీ తాగడం వల్ల రుతుచక్రం కూడా సక్రమంగా ఉండేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు.

ఇక గులాబీ పువ్వుల సహజసిద్ధమైన సువాసన మనసుపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ టీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రిళ్లు నిద్రలేమితో బాధపడేవారికి ఇది హాయిగా నిద్రపట్టేందుకు కూడా సహకరిస్తుంది.

Read also:AP : సీఎం చంద్రబాబు ప్రకటన: అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్

 

Related posts

Leave a Comment