Rajashekar : టాలెంట్ కన్నా ఫాలోవర్లే ముఖ్యం- శివాత్మిక రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు:టాలీవుడ్ సీనియర్ నటులు రాజశేఖర్, జీవితల కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన యువ నటి శివాత్మిక రాజశేఖర్, ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న కొన్ని పోకడలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలెంట్ కంటే సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ కారణంగా తాను కొన్ని అవకాశాలు కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అవకాశాలు కోల్పోతున్న శివాత్మిక? సోషల్ మీడియా ప్రభావంపై ఆవేదన
టాలీవుడ్ సీనియర్ నటులు రాజశేఖర్, జీవితల కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన యువ నటి శివాత్మిక రాజశేఖర్, ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న కొన్ని పోకడలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలెంట్ కంటే సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ కారణంగా తాను కొన్ని అవకాశాలు కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
శివాత్మిక రాజశేఖర్ 2019లో ‘దొరసాని’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తొలి సినిమాలోనే తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుని, సైమా ఉత్తమ నూతన నటి అవార్డును కూడా గెలుచుకున్నారు. ఆ తర్వాత ‘పంచతంత్రం’, ‘రంగమార్తాండ’ వంటి తెలుగు చిత్రాలతో పాటు, తమిళంలో ‘ఆనందం విలయదుం వీడు’, ‘నితమ్ ఒరు వానం’ వంటి సినిమాల్లో నటించారు. గ్లామర్ పాత్రలకు దూరంగా, నటనకు ఆస్కారమున్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితిపై ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. “ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రతిభ కంటే సోషల్ మీడియా ప్రభావమే ఎక్కువగా ఉంది. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ తక్కువగా ఉన్నారనే కారణంతో కొన్ని సినిమా ఆఫర్లు చేజారిపోయాయి. నా స్థానంలో ఎక్కువ ఫాలోవర్లు ఉన్నవారిని తీసుకున్నారు” అని శివాత్మిక వాపోయారు.
ఈ పరిస్థితి వల్ల ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవాలంటూ మేనేజర్లు, ఏజెంట్ల నుంచి తనపై ఒత్తిడి కూడా వచ్చిందని ఆమె తెలిపారు. “నేను ఒక నటిని, కంటెంట్ క్రియేటర్‌ను కాదు. నా నటనతో నన్ను గుర్తించాలి కానీ, సోషల్ మీడియాలోని అంకెల ఆధారంగా కాదు” అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. తెలుగులో ‘రంగమార్తాండ’ తర్వాత శివాత్మిక నుంచి కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు వెలువడకపోవడం గమనార్హం. ప్రస్తుతం శివాత్మిక చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Read also:Air India : ఎయిరిండియాకు డీజీసీఏ షాక్: భద్రతా నిబంధనల ఉల్లంఘనపై తీవ్ర చర్యలు