UK and India : భారత్-బ్రిటన్ బంధం పటిష్టం: యూకేలో దూసుకుపోతున్న భారతీయ కంపెనీలు

Indian Companies Thrive in the UK: A New Era for Economic Ties

UK and India : భారత్-బ్రిటన్ బంధం పటిష్టం: యూకేలో దూసుకుపోతున్న భారతీయ కంపెనీలు:భారత్, బ్రిట‌న్‌ల మధ్య ఆర్థిక భాగస్వామ్యం మరింత బలపడుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్‌లో భారతీయ యాజమాన్యంలోని కంపెనీల సంఖ్య, అవి ఆర్జిస్తున్న ఆదాయం గణనీయంగా పెరిగాయి. గురువారం విడుదలైన ఒక నివేదిక ప్రకారం, 2024లో 971గా ఉన్న భారతీయ కంపెనీల సంఖ్య, 2025 నాటికి 23 శాతానికి పైగా వృద్ధితో 1,197కు చేరింది.

బ్రిటన్‌లో భారతీయ కంపెనీల వృద్ధి

భారత్, బ్రిట‌న్‌ల మధ్య ఆర్థిక భాగస్వామ్యం మరింత బలపడుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్‌లో భారతీయ యాజమాన్యంలోని కంపెనీల సంఖ్య, అవి ఆర్జిస్తున్న ఆదాయం గణనీయంగా పెరిగాయి. గురువారం విడుదలైన ఒక నివేదిక ప్రకారం, 2024లో 971గా ఉన్న భారతీయ కంపెనీల సంఖ్య, 2025 నాటికి 23 శాతానికి పైగా వృద్ధితో 1,197కు చేరింది. 2017లో గ్రాంట్ థోర్న్టన్ సంస్థ ఈ సంఖ్యలను ట్రాక్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇదే అత్యధిక పెరుగుదల. ఈ కంపెనీలు బ్రిటన్‌లో సంపాదించిన మొత్తం ఆదాయం కూడా 2024లోని £68.09 బిలియన్ల నుంచి £72.14 బిలియన్లకు పెరిగింది. ఈ భారతీయ వ్యాపార సంస్థలు యూకే వ్యాప్తంగా 1,26,720 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.

గత ఏడాది కాలంలోనే 8,000కు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాయి. ఈ కంపెనీలలో మహిళా డైరెక్టర్ల నిష్పత్తి 2024లో 21 శాతం ఉండగా, అది 24 శాతానికి పెరిగింది. ఈ ఏడాది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీల జాబితాలో 74 సంస్థలు 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి. గ్రాంట్ థోర్న్టన్ భాగస్వామి, సౌత్ ఏషియా బిజినెస్ గ్రూప్ హెడ్ అనుజ్ చండే మాట్లాడుతూ, ఈ ఏడాది ‘ఇండియా మీట్స్ బ్రిటన్ ట్రాకర్’ నివేదికలోని అంశాలు భారత్-బ్రిటన్‌ల మధ్య ఉన్న లోతైన, చారిత్రక సంబంధానికి నిదర్శనం అన్నారు.

భారతీయ కంపెనీలు వృద్ధి చెందడానికి యూకేను ఒక కీలక పెట్టుబడి కేంద్రంగా భారత్ చూస్తోందని స్పష్టమవుతోందని ఆయన తెలిపారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సహకారంతో రూపొందిన ఈ నివేదిక, ఇండియా గ్లోబల్ ఫోరం (ఐజీఎఫ్) చేరికతో మరింత బలోపేతమైంది. లండన్‌లోని క్వీన్ ఎలిజబెత్-II సెంటర్‌లో జరిగిన ఐజీఎఫ్ లండన్ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమంలో భాగంగా యూకే వాణిజ్య, వ్యాపార శాఖ మంత్రి జోనాథన్ రేనాల్డ్స్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ నివేదికను అధికారికంగా విడుదల చేశారు.

అత్యధిక వృద్ధి నమోదు చేసిన కంపెనీలు

1.విప్రో ఐటీ సర్వీసెస్ యూకే సొసైటాస్ 448 శాతం ఆదాయ వృద్ధితో వృద్ధి ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

2.కొత్తగా ప్రవేశించిన కార్పొరేట్ ఐటీ మేనేజ్‌మెంట్ సంస్థ జోహో కార్పొరేషన్ లిమిటెడ్ 197 శాతం వృద్ధితో తర్వాతి స్థానంలో ఉంది.

భారతీయ కంపెనీల స్థానం, రంగాల వారీగా విస్తరణ

1కంపెనీల ప్రధాన కార్యాలయాల పరంగా చూస్తే, లండన్ మొదటి చాయిస్‌గా కొనసాగుతోంది. మొత్తం కంపెనీలలో 47 శాతం లండన్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత సౌత్ ఆఫ్ ఇంగ్లాండ్ (24.3 శాతం) ఉంది.

2.రంగాల వారీగా చూస్తే, టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్స్ (టీఎంటీ) రంగం 31 శాతం ట్రాకర్ కంపెనీలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

3.ఫార్మాస్యూటికల్స్, రసాయనాల రంగం 22 శాతంతో రెండో స్థానంలో నిలిచింది.

4.లండన్ గ్లోబల్ ఫైనాన్స్ హబ్‌లో భారతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వ్యూహాత్మక విస్తరణ కారణంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం కూడా ట్రాకర్ కంపెనీలలో 9.5 శాతానికి పెరిగింది. ఇటీవలి సంవత్సరాలలో ఇదే అత్యధిక వృద్ధిని నమోదు చేసిందని నివేదిక పేర్కొంది.

Read also:KTR : కేటీఆర్ బ్రిటన్ పర్యటన: ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరంలో కీలక ప్రసంగం

 

Related posts

Leave a Comment