Telangana :ఫోన్ ట్యాపింగ్ కేసు: ఆర్కే, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సిట్ నోటీసులు:తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ (ఆర్కే), చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు సిట్ నోటీసులు జారీ చేసింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం నమోదు చేసుకోవడానికి విచారణకు హాజరుకావాలని వేమూరి రాధాకృష్ణకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు: దర్యాప్తు వేగవంతం చేసిన సిట్
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ (ఆర్కే), చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు సిట్ నోటీసులు జారీ చేసింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం నమోదు చేసుకోవడానికి విచారణకు హాజరుకావాలని వేమూరి రాధాకృష్ణకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు సిట్ ఎదుట హాజరుకావాలని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) వద్ద దొరికిన కాల్ డిటైల్ రికార్డ్స్లో (సీడీఆర్) రాధాకృష్ణ ఫోన్ నంబర్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
దీనివల్ల కేసు దర్యాప్తులో ఆయన వాంగ్మూలం అవసరమని భావించి నోటీసులు పంపినట్లు తెలిపారు. దీంతో ఆయన శుక్రవారం సిట్ అధికారుల ముందు హాజరుకానున్నారు.బీజేపీ సీనియర్ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కూడా సిట్ నుంచి పిలుపు అందింది. ఆయన ఫోన్ను కూడా ట్యాప్ చేసినట్లు ఆధారాలు లభించడంతో విచారణకు రావాలని అధికారులు కోరారు. 2023 నవంబర్లో అప్పటి ఎస్ఐబీ అధికారి ప్రణీత్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ను ట్యాప్ చేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలోనే ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకోనున్నారు.ఈ కేసులో భాగంగా ఇప్పటివరకు మొత్తం 618 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. వీరిలో ఇప్పటికే 228 మందికి నోటీసులు జారీ చేసి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు.
Read also:AP : చంద్రబాబుతో ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్: ఏపీ స్పేస్ పాలసీ 4.0పై చర్చ
