AIR: బ్యాక్ బెంచర్ల నుండి ఆల్ ఇండియా ర్యాంకర్స్ వరకు

AIR (All India Rankers): A Fresh Take on Student Life and Pressure

AIR: బ్యాక్ బెంచర్ల నుండి ఆల్ ఇండియా ర్యాంకర్స్ వరకు:ఈ మధ్యకాలంలో విద్యార్థులు, వారి చదువులు, మరియు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై వస్తున్న సిరీస్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది. సహజత్వానికి దగ్గరగా ఉంటూ ప్రేక్షకులను కనెక్ట్ చేయడమే దీనికి కారణం. ఈ ప్రయత్నంలో భాగంగా వచ్చిన సిరీస్‌లలో ‘AIR’ (ఆల్ ఇండియా ర్యాంకర్స్) ఒకటి.

విద్యార్థుల సమస్యలపై ఒక ఆసక్తికరమైన వెబ్ సిరీస్

ఈ మధ్యకాలంలో విద్యార్థులు, వారి చదువులు, మరియు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై వస్తున్న సిరీస్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది. సహజత్వానికి దగ్గరగా ఉంటూ ప్రేక్షకులను కనెక్ట్ చేయడమే దీనికి కారణం. ఈ ప్రయత్నంలో భాగంగా వచ్చిన సిరీస్‌లలో ‘AIR’ (ఆల్ ఇండియా ర్యాంకర్స్) ఒకటి.

హర్ష రోషన్, భానుప్రతాప్, సింధూ రెడ్డి, జయతీర్థ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్, జూలై 3వ తేదీ నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఇటీవల ‘కోర్ట్’ సినిమాతో హర్ష రోషన్‌కు వచ్చిన క్రేజ్, ఈ సిరీస్‌కు ఖచ్చితంగా కలిసొస్తుంది.

ఇంటర్ విద్యార్థులను ఎక్కువగా ఇబ్బంది పెట్టే అంశం ర్యాంకులు. కాలేజీలు ర్యాంకుల విషయంలో భారీగా హడావిడి చేస్తాయి. ఈ ర్యాంకుల కోసం తల్లిదండ్రులు నిరంతరం పిల్లలపై ఒత్తిడి తెస్తూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదనే అంశాన్ని ప్రధానంగా చేసుకుని ఈ సిరీస్‌ను రూపొందించారు. బ్యాక్ బెంచ్ విద్యార్థుల చుట్టూ తిరుగుతూ, ఈ సిరీస్ సరదాగా నవ్విస్తుంది, అదే సమయంలో ఆలోచింపజేస్తుంది. మరి ఈ సిరీస్‌కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Read also:Babli Project : బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఓపెన్: గోదావరికి పునరుజ్జీవం

 

Related posts

Leave a Comment