AP : రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం

Andhra Pradesh CM Fumes Over Delays in Land Dispute Resolutions

AP : రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం:ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వెలిబుచ్చారు. భూ సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై అధికారుల వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. శుక్రవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ పరిస్థితి నెలకొంది.

భూ సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వెలిబుచ్చారు. భూ సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై అధికారుల వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. శుక్రవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి శాఖ పనితీరు పట్ల ఎంతమాత్రం సంతృప్తిగా లేరని విశ్వసనీయ వర్గాల సమాచారం.

గత ప్రభుత్వాల వైఫల్యాల కారణంగానే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో భూ వివాదాలు, సర్వే సమస్యలు తీవ్రమయ్యాయని చంద్రబాబు దుయ్యబట్టారు. తహసీల్దార్ కార్యాలయాల్లో వేలాది దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోకుండా పేరుకుపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడాలంటే భూ సమస్యలను వేగంగా పరిష్కరించడం, సేవలను సరళతరం చేయడం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.

మహానాడులో ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలోగా భూ సమస్యలను పరిష్కరించి తీరుతామని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. ఉపరితల మార్పులకు పరిమితం కాకుండా, క్షేత్రస్థాయి నుంచి రెవెన్యూ శాఖలో సమూల ప్రక్షాళన చేస్తేనే ఆశించిన ఫలితాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. సిబ్బంది కొరత, పనిభారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే, రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సమీక్ష అనంతరం భూ సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.

Read also:Kavitha :కేసీఆర్ చుట్టూ దెయ్యాలు.. ముఖ్యమంత్రి కావడమే నా ఆశయం: కవిత ఫైర్!

 

Related posts

Leave a Comment