Chandrababu : ఏపీ పర్యాటక రంగంలో యూఏఈ భాగస్వామ్యం

UAE Eyes Andhra Pradesh: Major Investments Discussed

Chandrababu : ఏపీ పర్యాటక రంగంలో యూఏఈ భాగస్వామ్యం:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ గత రాత్రి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.

చంద్రబాబు విజన్‌కు ఆరు నెలల్లోనే యూఏఈ ఓకే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ గత రాత్రి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ రోజు విజయవాడలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ కార్యక్రమంలో పాల్గొన్న యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్, “దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కేవలం ఐదు నిమిషాలు మాట్లాడాను. ఆయన విజన్, ఆలోచనా విధానం నాకు ఎంతగానో నచ్చాయి. అందుకే ఆరు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మేము సిద్ధమయ్యాం” అని వెల్లడించారు.ఏపీలో యూఏఈ పెట్టుబడులతో పర్యాటక రంగంలో గణనీయమైన పురోగతి సాధించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read also:AndhraPradesh : నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఏపీలో 100 FSO పోస్టులు

 

Related posts

Leave a Comment