Movie News : రాముడిగా రణ్బీర్, సీతగా సాయిపల్లవి ఎంపిక – సహజత్వానికి ప్రాధాన్యం:భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణం’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే.
రామాయణం’ చిత్రం: కీలక పాత్రల ఎంపిక వెనుక ఆసక్తికర కారణాలు
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణం’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే రావణుడి పాత్రలో యష్ నటిస్తుండగా, హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఆసక్తికర విషయాలను మేకర్స్ ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా కీలక పాత్రలు పోషించిన రణ్బీర్ కపూర్, సాయిపల్లవిని తీసుకోవడం వెనుక ఉన్న కారణాన్ని మేకర్స్ వెల్లడించారు.
రాముడిగా రణ్బీర్ను ఎంచుకోవడానికి కారణం ఆయన గొప్ప నటన, ప్రశాంతమైన వ్యక్తిత్వం అని తెలిపారు. అలాగే సీతాదేవిగా సాయిపల్లవిని తీసుకోవడానికి కారణం ఆమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటం, అందం కోసం సర్జరీలు చేయించుకోకపోవడం అని మేకర్స్ పేర్కొన్నారు. కృత్రిమం కన్నా సహజ సౌందర్యమే ఉత్తమమనే సందేశాన్ని ‘రామాయణం’ బృందం ఈ ఎంపిక ద్వారా ఇవ్వదలిచింది. ఇప్పటికే విడుదలైన మూవీ గ్లింప్స్ ‘రామాయణం’పై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. ఇందులో భాగంగా మొదటి పార్ట్ 2026 దీపావళికి విడుదల కానుండగా, రెండో పార్ట్ 2027 దీపావళికి వస్తుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
Read also:Dubai : దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త: వివాహ సెలవుల్లో కొత్త మార్పులు
