Deepika Padukone : దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం: హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు ఎంపిక

Deepika Padukone Honored with Hollywood Walk of Fame Star for 2026

Deepika Padukone : దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం: హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు ఎంపిక:ప్రముఖ నటి దీపికా పదుకొణెకు అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు ఆమె ఎంపికయ్యారు. ఈ విషయాన్ని హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారికంగా ప్రకటించింది. మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపిక ఈ ఘనతను సాధించారు.

దీపికా పదుకొణె ఖాతాలో మరో రికార్డు: హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్

ప్రముఖ నటి దీపికా పదుకొణెకు అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు ఆమె ఎంపికయ్యారు. ఈ విషయాన్ని హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారికంగా ప్రకటించింది. మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపిక ఈ ఘనతను సాధించారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవం పొందిన తొలి భారతీయ నటిగా ఆమె చరిత్ర సృష్టించారు.

హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విడుదల చేసిన జాబితాలో డెమి మూర్, రాచెల్ మెక్ ఆడమ్స్, ఎమిలీ బ్లంట్ వంటి అంతర్జాతీయ తారలతో పాటు దీపిక పేరు కూడా ఉండటంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026 కోసం మొత్తం 35 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసినట్లు ఛాంబర్ తెలిపింది.దీపికా పదుకొణె 2006లో సినీ రంగ ప్రవేశం చేశారు. 2017లో వచ్చిన ‘రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ చిత్రంతో హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రానున్న బహుభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌లోనూ కనిపించనున్నారు.

Read also:Niharika : నిహారిక కొణిదెల కొత్త సినిమా ప్రారంభం: సంగీత్ శోభన్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.2

 

Related posts

Leave a Comment