H1B : హెచ్‌1బీ తిరస్కరణ: శాపమా? వరమా? నితిన్ కౌశిక్ విశ్లేషణ

H1B Rejection: A Blessing in Disguise? CA Nitin Kaushik's Viral Take

H1B : హెచ్‌1బీ తిరస్కరణ: శాపమా? వరమా? నితిన్ కౌశిక్ విశ్లేషణ:అమెరికాలో ఉద్యోగం, డాలర్లలో జీతం.. ఎంతో మంది భారతీయ యువత కల ఇది. దీనికి మార్గమైన హెచ్‌1బీ వీసా పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. అయితే, ఒకవేళ ఆ వీసా తిరస్కరణకు గురైతే నిరాశ చెందాల్సిన అవసరం లేదని, అదొక రకంగా శుభపరిణామమేనని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) నితిన్ కౌశిక్ చేసిన ఓ విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

హెచ్‌1బీ వీసా తిరస్కరణ: మంచి అవకాశమా?

అమెరికాలో ఉద్యోగం, డాలర్లలో జీతం.. ఎంతో మంది భారతీయ యువత కల ఇది. దీనికి మార్గమైన హెచ్‌1బీ వీసా పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. అయితే, ఒకవేళ ఆ వీసా తిరస్కరణకు గురైతే నిరాశ చెందాల్సిన అవసరం లేదని, అదొక రకంగా శుభపరిణామమేనని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) నితిన్ కౌశిక్ చేసిన ఓ విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఎంతోమంది హెచ్‌1బీ వీసాదారులు భారత్‌కు తిరిగి వస్తున్నారని, ఇది బాధ కలిగించే విషయమే అయినా, మరో కోణంలో చూస్తే ఇది గొప్ప అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు.

హెచ్‌1బీ వీసా తిరస్కరణ బహుశా మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ విషయం కావచ్చు” అంటూ నితిన్ కౌశిక్ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. విదేశాల్లో జీతాలు డాలర్లలో ఆకర్షణీయంగా కనిపించినా, అక్కడి ఖర్చులు, అద్దెలు, పిల్లల సంరక్షణ, ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటాయని ఆయన గుర్తుచేశారు. కానీ, భారతదేశంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వివరించారు.

భారత్‌లో ఏటా రూ. 20-25 లక్షల జీతంతో అత్యంత నాణ్యమైన జీవితాన్ని గడపవచ్చని కౌశిక్ ఉదాహరణలతో సహా తెలిపారు. మెట్రో నగరాల్లో మంచి 2బీహెచ్‌కే ఫ్లాట్ లేదా టైర్-2 నగరంలో విల్లా, కారు, ఇంటి పనులకు సహాయకులు, పిల్లలకు మంచి విద్య, ప్రపంచ స్థాయి ప్రైవేట్ వైద్య సదుపాయాలు వంటివన్నీ ఈ జీతంతోనే సౌకర్యవంతంగా పొందవచ్చని పేర్కొన్నారు. అమెరికా, యూకే, కెనడా వంటి దేశాల్లో ఇలాంటి జీవనశైలిని ఊహించడం కూడా కష్టమని ఆయన పోల్చి చెప్పారు.

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంటే, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని కౌశిక్ అన్నారు. అందువల్ల, ఇక్కడే ఉండి ఈ వృద్ధిలో భాగస్వాములు కావడం ద్వారా మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చని సూచించారు. కుటుంబం, సంస్కృతికి దగ్గరగా ఉండటం వల్ల లభించే మానసిక ప్రశాంతతను మరేదీ భర్తీ చేయలేదని ఆయన అభిప్రాయపడ్డారు. హెచ్‌1బీ తిరస్కరణను ఒక వైఫల్యంగా కాకుండా, సొంత దేశంలోనే ఉన్నతమైన జీవితాన్ని గడిపేందుకు లభించిన మరో అవకాశంగా చూడాలని ఆయన సూచించారు.

Read also:Matrimony : మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌తో రూ.22 లక్షలు కాజేసిన కిలాడీ లేడీ

 

Related posts

Leave a Comment