Sambhal : ఘోర రోడ్డు ప్రమాదం: పెళ్లి ఇంట తీవ్ర విషాదం, ఒకే కుటుంబంలో ఎనిమిది మరణాలు:ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో నిన్న (శుక్రవారం) సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పెళ్లికొడుకు సహా ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో వివాహం జరగాల్సిన ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సంభాల్‌లో పెను విషాదం: పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం బోల్తా, ఎనిమిది మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో నిన్న (శుక్రవారం) సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పెళ్లికొడుకు సహా ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో వివాహం జరగాల్సిన ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
హర్‌గోవింద్‌పూర్ గ్రామానికి చెందిన సుఖ్రామ్ తన కుమారుడు సూరజ్ పాల్ (20) వివాహాన్ని బదౌన్ జిల్లాలోని సిర్సౌల్ గ్రామానికి చెందిన యువతితో నిశ్చయించారు. నిన్న సాయంత్రం 11 వాహనాల్లో పెళ్లి బృందం బయలుదేరింది. అయితే, వరుడు సూరజ్‌తో పాటు మరో తొమ్మిది మంది ప్రయాణిస్తున్న మహీంద్రా బొలెరో వాహనం కాస్త వెనుకబడింది.
మీరట్-బదౌన్ జాతీయ రహదారిపై జునావాయి పట్టణం సమీపంలోకి రాగానే, బొలెరో వాహనం అతివేగంతో అదుపుతప్పి జనతా ఇంటర్ కాలేజీ ప్రహరీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి, వాహనంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు శ్రమించారు. జేసీబీ సహాయంతో వాహనం భాగాలను తొలగించి క్షతగాత్రులను బయటకు తీశారు.
క్షతగాత్రులను సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించగా, అప్పటికే ఎనిమిది మంది మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుల్లో వరుడు సూరజ్ పాల్‌తో పాటు రవి (28), ఆశ (26), సచిన్ (22), మధు (20), కోమల్ (15), ఐశ్వర్య (3), గణేష్ (2) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన హిమాన్షి, దేవ అనే మరో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read also:BJP : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్. రామచందర్‌రావు బాధ్యతల స్వీకరణ
