Hyderabad : హైదరాబాద్‌లో కల్తీ కల్లు బీభత్సం: 5 మంది దుర్మరణం, 31 మందికి అస్వస్థత

Hyderabad Adulterated Toddy Tragedy: Five Dead, Many Hospitalized

Hyderabad : హైదరాబాద్‌లో కల్తీ కల్లు బీభత్సం: 5 మంది దుర్మరణం, 31 మందికి అస్వస్థత:హైదరాబాద్‌లో కల్తీ కల్లు ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కల్తీ కల్లు తాగి ఐదుగురు మరణించగా, మరో 31 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

కల్తీ కల్లు విషాదం: హైదరాబాద్‌లో ఐదుగురు మృతి

హైదరాబాద్‌లో కల్తీ కల్లు ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కల్తీ కల్లు తాగి ఐదుగురు మరణించగా, మరో 31 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నగరంలోని ఇంద్రానగర్, భాగ్యనగర్ ప్రాంతాల్లోని కల్లు దుకాణాల్లో ఈ నెల 5, 6 తేదీల్లో కల్లు తాగిన పలువురు వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో వారిని నగరంలోని వివిధ ఆసుపత్రులకు, అనంతరం మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించారు.

మృతులు చాకలి బొజ్జయ్య (55), స్వరూప (61), సీతారాం (74), మౌనిక (25), మెట్ల నారాయణ (40) గా గుర్తించారు.ఈ ఘటనపై పోలీసులు, ఆబ్కారీ శాఖ అధికారులు తక్షణమే స్పందించారు. నగరంలోని నాలుగు కల్లు దుకాణాల నిర్వాహకులు, విక్రేతలతో సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కాంగ్రెస్ నేత కూన సత్యంగౌడ్ కుమారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు.

దుకాణాల నుంచి కల్లు నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా, కల్లులో ఆల్ప్రాజోలం వంటి ప్రమాదకర రసాయనాలు కలపడమే ఈ విషాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మరోవైపు, మంత్రి జూపల్లి కృష్ణారావు నిమ్స్‌లో బాధితులను పరామర్శించారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, లైసెన్సులు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు ఉన్నా, లైసెన్సులు రద్దు చేసినా కల్తీ విక్రయాలు ఆగకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read also:Telangana : గ్రేటర్ హైదరాబాద్‌లో మరో గుడ్‌న్యూస్: రూ. 5కే టిఫిన్ అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

 

Related posts

Leave a Comment