NRI : యూరప్‌లో జీవితం అంత సులువు కాదా? ఒక ఎన్ఆర్ఐ గోడు!

The Harsh Reality of Living Abroad: An NRI's European Experience

NRI : యూరప్‌లో జీవితం అంత సులువు కాదా? ఒక ఎన్ఆర్ఐ గోడు:చాలామంది విదేశాల్లో స్థిరపడాలని కలలు కంటుంటారు. అయితే, అది అంత సులభం కాదని, కొత్త దేశంలో జీవించడం సవాళ్లతో కూడుకున్నదని ఒక ఎన్నారై సోషల్ మీడియాలో తన అనుభవాలను పంచుకున్నారు. యూరప్‌లో నివసిస్తున్న తాను రోజువారీ ఎదుర్కొంటున్న కష్టాలను వివరిస్తూ ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

ఎన్నారై కష్టాలు: స్వదేశానికి తిరిగి రావాలా?

చాలామంది విదేశాల్లో స్థిరపడాలని కలలు కంటుంటారు. అయితే, అది అంత సులభం కాదని, కొత్త దేశంలో జీవించడం సవాళ్లతో కూడుకున్నదని ఒక ఎన్నారై సోషల్ మీడియాలో తన అనుభవాలను పంచుకున్నారు. యూరప్‌లో నివసిస్తున్న తాను రోజువారీ ఎదుర్కొంటున్న కష్టాలను వివరిస్తూ ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇల్లు, కుటుంబానికి దూరంగా ఉండటం, పరాయి దేశంలో బ్రతకడం ఎంత కష్టమో ఆయన వివరించారు.దేవ్ విజయ్ వర్గీయ అనే సాఫ్ట్‌వేర్ డెవలపర్ స్వీడన్‌లో స్థిరపడ్డారు. స్వీడన్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి అక్కడికి వెళ్లినట్లు ఆయన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో తెలిపారు. “విదేశాల్లో స్థిరపడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాను.

కానీ, ఇక్కడ నివసించాకే నిజమైన కష్టాలు తెలిశాయి. ఇంటికి దూరంగా ఉండటం ఒక బాధ అయితే, ఇక్కడ జీవన వ్యయం చాలా ఎక్కువ. జీతంలో 30% నుంచి 50% పన్నుల రూపంలో ప్రభుత్వమే తీసుకుంటుంది. మిగిలిన దాంట్లో ఇంటి అద్దె, నిత్యావసరాలకే చాలా ఖర్చవుతుంది. ఒంటరితనం వెంటాడుతుంది” అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, “వాతావరణం అత్యంత కఠినంగా ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్‌లోకి పడిపోతాయి. ఇవన్నీ పక్కన పెడితే… ఇక్కడ ఎంత కాలం నుంచి ఉద్యోగం చేస్తున్నా, పన్నులు కడుతున్నా సరే, దురదృష్టవశాత్తు ఉద్యోగం పోతే వారం రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే.

మీరు ఇక్కడ ఉండాలా, వెళ్లిపోవాలా అనేది మీ ఉద్యోగంపైనే ఆధారపడి ఉంటుంది” అంటూ స్వీడన్‌లో తాను ఎదుర్కొంటున్న పలు సమస్యలను దేవ్ విజయ్ తన వీడియోలో వివరించారు. యూరప్‌కు వెళ్లాలనుకునేవారికి అవగాహన కల్పించడం కోసమే ఈ వీడియోను పోస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.అయితే, దేవ్ విజయ్ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. స్వీడన్‌లో నివసించడం అంత కష్టంగా ఉంటే, “ఇంకా అక్కడే ఎందుకున్నావు సోదరా? స్వదేశానికి తిరిగి వచ్చేయొచ్చు కదా” అని విమర్శిస్తూ కామెంట్లు పెట్టారు. “స్వదేశానికి రాకుండా అక్కడ నిన్ను ఎవరు ఆపుతున్నారు?” అని కొందరు ప్రశ్నించారు. మరోవైపు, దేవ్ విజయ్ చెప్పిన కొన్ని విషయాల్లో తప్పులు ఉన్నాయని కొందరు నెటిజన్లు ఆరోపించారు. “ఉద్యోగం కోల్పోయిన వారం రోజుల్లోనే దేశం విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. కనీసం మూడు నెలలు అక్కడే ఉండే వీలును చట్టం కల్పిస్తుంది. పర్మినెంట్ రెసిడెంట్ అయితే దేశం విడిచిపెట్టే అవసరమే ఉండదు” అని ఒక యూజర్ కామెంట్ చేశారు.

Read also:Digital Payment : సైబర్ మోసాల నుండి రక్షణ: NPCI 5 సూత్రాలు

 

Related posts

Leave a Comment