Both States : కృష్ణా నదికి భారీ వరద: జలాశయాలు నిండు కుండలు

Heavy Inflows Continue into Srisailam and Nagarjuna Sagar

Both States : కృష్ణా నదికి భారీ వరద: జలాశయాలు నిండు కుండలు:ఈ ఏడాది మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు ముందే నిండాయి. అల్మట్టి నుంచి శ్రీశైలం వరకు ఉన్న జలాశయాలు గత వారంలోనే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

శ్రీశైలం, సాగర్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి

ఈ ఏడాది మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు ముందే నిండాయి. అల్మట్టి నుంచి శ్రీశైలం వరకు ఉన్న జలాశయాలు గత వారంలోనే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి అదనంగా వస్తున్న వరద నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయానికి 1,98,920 క్యూసెక్కుల మేర వరద పెరగడంతో, నిన్న నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,08,260 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అదనంగా 66,896 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

నాగార్జునసాగర్‌కు 2,01,743 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం సాగర్ నుంచి 41,882 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ఈరోజు ఉదయం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండటంతో, ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు నదిలోకి వెళ్లవద్దని సూచించారు.

సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 586.60 అడుగుల నీటి మట్టం ఉంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.4 టీఎంసీలకు చేరుకోవడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్‌కు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది.

Read also:TTD : సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ నుండి తిరుమల శ్రీవారికి అపురూప కానుక: 2.5 కిలోల బంగారు శంఖు చక్రాలు

Related posts

Leave a Comment