Tirumala : సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు: తిరుమలలో భద్రతపై ప్రశ్నలు

Leopard Roams Near Alipiri: Devotees Panicked

Tirumala : సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు: తిరుమలలో భద్రతపై ప్రశ్నలు:తిరుమల శ్రీవారి భక్తులను చిరుతలు భయపెట్టిన ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. తాజాగా మరో చిరుత భక్తులను హడలెత్తించింది. ఇవాళ (జూలై 17, 2025) తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో అలిపిరి జూపార్క్ వద్ద చిరుత సంచరించింది.

తిరుమలలో చిరుత సంచారం: భక్తులకు తప్పిన ప్రమాదం

తిరుమల శ్రీవారి భక్తులను చిరుతలు భయపెట్టిన ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. తాజాగా మరో చిరుత భక్తులను హడలెత్తించింది. ఇవాళ (జూలై 17, 2025) తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో అలిపిరి జూపార్క్ వద్ద చిరుత సంచరించింది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసిన ఇనుప కంచెను దాటుకుని రోడ్డుపైకి వచ్చిన చిరుత హల్ చల్ చేసింది. అక్కడి నుంచి అరవింద్ కంటి ఆసుపత్రి వద్దకు వెళ్లి చక్కర్లు కొట్టింది.

తెల్లవారుజామున నడక మార్గంలో వెళ్తున్న భక్తులు చిరుతను చూసి ఒక్కసారిగా పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.చిరుత సంచరించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనతో తిరుమలలో భక్తుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. అటవీ శాఖ అధికారులు చిరుత సంచారంపై మరింత అప్రమత్తంగా ఉండాలని భక్తులు కోరుతున్నారు.

Read also:AkashPrime : ఆకాశ్ ప్రైమ్ క్షిపణి వ్యవస్థ విజయవంతం: భారత సైన్యానికి మరో బలం

 


Related posts

Leave a Comment