Lokesh : విద్యార్థుల విద్యాకాంక్షకు మంత్రి లోకేశ్ చేయూత: తక్షణమే ఏర్పాట్లు చేయాలని ఆదేశం

Minister Nara Lokesh Moved by Children's Plea for Education, Assures Full Support

Lokesh : విద్యార్థుల విద్యాకాంక్షకు మంత్రి లోకేశ్ చేయూత: తక్షణమే ఏర్పాట్లు చేయాలని ఆదేశం:చదువుకోవాలనే తపనతో అధికారులు ఆశ్రయించిన ఇద్దరు చిన్నారుల ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా చలించిపోయారు. ఆ పిల్లల విద్యాభ్యాసానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను తక్షణమే ఆదేశించారు. వారి కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

చిన్నారుల విద్యాకాంక్షపై స్పందించిన మంత్రి నారా లోకేశ్: అండగా నిలుస్తామని హామీ

చదువుకోవాలనే తపనతో అధికారులు ఆశ్రయించిన ఇద్దరు చిన్నారుల ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా చలించిపోయారు. ఆ పిల్లల విద్యాభ్యాసానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను తక్షణమే ఆదేశించారు. వారి కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే, నెల్లూరు నగరంలోని వీఆర్ స్కూలు వద్ద పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు చిన్నారులు తమను బడిలో చేర్చించాలంటూ కమిషనర్‌ను ప్రాధేయపడ్డారు. ఈ విషయం మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో మంత్రి లోకేశ్ దృష్టికి వెళ్లింది.

ఈ ఘటనపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “చిన్నారులు తమకు చదువు చెప్పించాలని కమిషనర్‌ను ప్రాధేయపడటం నన్ను కదిలించింది. వారి చదువుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అక్కడి అధికారులను ఆదేశించాను” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక్కటే బలమైన సాధనమని లోకేశ్ అభిప్రాయపడ్డారు. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలన్న కసి, పట్టుదల ఉంటే ఎలాంటి కష్టాలనైనా అధిగమించవచ్చని ఆయన అన్నారు. ఈ చిన్నారుల ఆశయ సాధనకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనాన్ని కూడా ఆయన తన పోస్టుతో పాటు పంచుకున్నారు.

Read also:BJP : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్. రామచందర్‌రావు బాధ్యతల స్వీకరణ

 

Related posts

Leave a Comment