Mallareddy : మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధిపై మల్లారెడ్డి అసహనం, ఈటల రాజేందర్ ఆగ్రహం:మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి తాను చేసిన కృషికి కనీస గౌరవం కూడా లభించడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినప్పటికీ, అధికారులు తమను పట్టించుకోవడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధిపై మల్లారెడ్డి అసహనం, ఈటల రాజేందర్ ఆగ్రహం
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి తాను చేసిన కృషికి కనీస గౌరవం కూడా లభించడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినప్పటికీ, అధికారులు తమను పట్టించుకోవడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతూ, తాను ఓడిపోయి ఉంటే ఇంట్లో కూర్చునేవాడినని వ్యాఖ్యానించారు.
ఈ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ కూడా మాట్లాడుతూ పలు అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడి, గుడి అనే తేడా లేకుండా అన్ని చోట్లా మద్యం, గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. దీనివల్ల యువత పెడదోవ పడుతోందని, ప్రొహిబిషన్ శాఖ ప్రమోషన్ శాఖగా మారిందని విమర్శించారు. ఎక్సైజ్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు చేసే పనుల ద్వారా ప్రజలకు వ్యవస్థపై విశ్వాసం కలిగించాలని, కేంద్ర, రాష్ట్ర పథకాల మధ్య వ్యత్యాసం చూపకుండా ప్రజలకు లబ్ధి చేకూర్చాలని ఆయన సూచించారు. ఈ సమావేశానికి ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, లక్షారెడ్డి, జిల్లా కలెక్టర్ తదితరులు హాజరయ్యారు.
Read also:Visakhapatnam : ఐటీసీ గోడౌన్లో మంటలు: కాలి బూడిదైన సిగరెట్లు, బింగో ప్యాకెట్లు
