Lokesh : ప్రభుత్వ పాఠశాలల సంస్కరణలపై ‘మనబడికి మహా న్యూస్’ ప్రశంసనీయం – మంత్రి లోకేశ్

Nara Lokesh Commends 'Maha News' for Promoting AP's Education System Reforms

Lokesh : ప్రభుత్వ పాఠశాలల సంస్కరణలపై ‘మనబడికి మహా న్యూస్’ ప్రశంసనీయం – మంత్రి లోకేశ్:ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన సంస్కరణలు, వాటి ద్వారా వస్తున్న సానుకూల ఫలితాలపై ‘మనబడికి మహా న్యూస్’ పేరిట ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తున్న ‘మహా న్యూస్’ ఛానెల్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అభినందించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా సంస్కరణలపై ‘మహా న్యూస్’ ప్రశంసనీయం – మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన సంస్కరణలు, వాటి ద్వారా వస్తున్న సానుకూల ఫలితాలపై ‘మనబడికి మహా న్యూస్’ పేరిట ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తున్న ‘మహా న్యూస్’ ఛానెల్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మేము చేపట్టిన సంస్కరణలు, వాటి ఫలితాలను ‘మనబడికి మహా న్యూస్’ పేరుతో ప్రసారం చేస్తున్న మహా న్యూస్‌కు నా అభినందనలు.

దేశంలోనే అత్యున్నతంగా నిలిచేలా కూటమి ప్రభుత్వం ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి ఒకేసారి మహా న్యూస్ చేస్తున్న ఈ ప్రసారాలు ప్రభుత్వ విద్యా వికాసానికి ఎంతో దోహదం చేస్తాయి. తొలిసారిగా ప్రభుత్వ విద్యాలయాల్లో జరుగుతున్న మంచి గురించి నిరంతరాయంగా కథనాలు ప్రసారం చేస్తున్న మహా న్యూస్ యాజమాన్యానికి, జర్నలిస్టులకు, సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని లోకేశ్ ట్వీట్ చేశారు.

Read also:AP : లిక్కర్ కేసు విచారణ: సిట్ కస్టడీలో చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు

 

Related posts

Leave a Comment