SrisailamDam : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం

Srisailam Reservoir: Heavy Inflow of Floodwater

SrisailamDam : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం:కర్ణాటక, మహారాష్ట్రలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. సుంకేశుల, జూరాల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం

కర్ణాటక, మహారాష్ట్రలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. సుంకేశుల, జూరాల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంకు 1,27,392 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, శ్రీశైలం ఔట్ ఫ్లో 1,40,009 క్యూసెక్కులుగా నమోదైంది.

శ్రీశైలం జలాశయం నుంచి రెండు స్పిల్ వే గేట్ల ద్వారా నాగార్జున సాగర్‌కు 53,764 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వీటితో పాటు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,930 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.40 అడుగుల వద్ద ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 201.12 టీఎంసీలుగా నమోదైంది.

Read also:RakulPreetSingh : సోషల్ మీడియా నెగిటివిటీపై రకుల్ ప్రీత్ సింగ్ ఆగ్రహం

 

 

Related posts

Leave a Comment