TTD : సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ నుండి తిరుమల శ్రీవారికి అపురూప కానుక: 2.5 కిలోల బంగారు శంఖు చక్రాలు:చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ తిరుమల శ్రీవారికి రూ. 2.4 కోట్ల విలువైన బంగారు శంఖు చక్రాలను కానుకగా సమర్పించింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో కంపెనీ ప్రతినిధులు ఈ కానుకలను టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి అందజేశారు.
తిరుమల శ్రీవారికి రూ. 2.4 కోట్ల విలువైన బంగారు శంఖు చక్రాలు కానుక
చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ తిరుమల శ్రీవారికి రూ. 2.4 కోట్ల విలువైన బంగారు శంఖు చక్రాలను కానుకగా సమర్పించింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో కంపెనీ ప్రతినిధులు ఈ కానుకలను టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ శంఖు చక్రాలు 2.5 కిలోల బంగారంతో రూపొందించబడ్డాయి. వీటిని స్వామివారికి అలంకరించనున్నారు. కానుక సమర్పించిన దాతలను ఏఈఓ వెంకయ్య చౌదరి శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
