Sanjay : ఐపీఎస్ ఎన్. సంజయ్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు విచారణ: హైకోర్టు తీర్పుపై ఆశ్చర్యం:వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్ ముందస్తు బెయిల్ రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ అమానుల్లా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నిన్న ఈ కేసును విచారించింది.
ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్ ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు విచారణ
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్ ముందస్తు బెయిల్ రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ అమానుల్లా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నిన్న ఈ కేసును విచారించింది. సంజయ్కు ఏపీ హైకోర్టు 49 పేజీల ముందస్తు బెయిల్ తీర్పు ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
సంజయ్కు బెయిల్ మంజూరు చేసే విషయంలో ఏపీ హైకోర్టు విచారణను ఒక మినీ ట్రయల్లా నిర్వహించినట్లుగా ఉందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు, సంజయ్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తమ వాదనలు వినిపించారు.
ఈ కేసుకు సంబంధించిన ఒప్పంద పత్రం, ఇన్వాయిస్లను సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.ప్రభుత్వ న్యాయవాది ఒప్పంద పత్రాలు సమర్పించడానికి సమయం కోరడంతో, ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్గా ఎన్. సంజయ్ పనిచేసినప్పుడు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఆయనపై కేసు నమోదు చేసింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు పైన పేర్కొన్న విధంగా వ్యాఖ్యానించింది.
Read also:CMChandrababu : ప్రజల ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు సమీక్ష: కీలక ఆదేశాలు
