Tata : టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ జీతం 15% పెంపు: లాభాలు తగ్గినా భారీ వేతనంపై చర్చ

Controversy Brews as Tata Sons Chief Chandrasekaran's Pay Rises Despite Company's Profit Dip

Tata : టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ జీతం 15% పెంపు: లాభాలు తగ్గినా భారీ వేతనంపై చర్చ:టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 155.81 కోట్లు జీతంగా అందుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 15 శాతం ఎక్కువ. 2023-24 ఆర్థిక సంవత్సరంలో చంద్రశేఖరన్ వేతనం రూ. 135 కోట్లుగా ఉంది.

టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ జీతం 15 శాతం పెంపు

టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 155.81 కోట్లు జీతంగా అందుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 15 శాతం ఎక్కువ. 2023-24 ఆర్థిక సంవత్సరంలో చంద్రశేఖరన్ వేతనం రూ. 135 కోట్లుగా ఉంది. కంపెనీ వార్షిక నివేదిక ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆయన వేతనం రూపంలో రూ. 15.1 కోట్లు, ఇతర కమిషన్, లాభాల రూపంలో రూ. 140.7 కోట్లు ఆర్జించారు.

టాటా సన్స్లో ఇతర ఉద్యోగుల విషయానికి వస్తే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సౌరభ్ అగర్వాల్ 2025 వార్షిక సంవత్సరంలో రూ. 32.7 కోట్లు జీతంగా పొందారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 7.7 శాతం అధికం. రతన్ టాటా మరణం తర్వాత టాటా సన్స్‌లో చేరిన నోయల్ టాటాకు రూ. 1.42 కోట్ల కమిషన్ వచ్చింది.

2025 మార్చిలో రిటైర్ అయిన మాజీ బోర్డు సభ్యుడు లియో పురికి రూ. 3.13 కోట్ల కమిషన్ వచ్చింది. అలాగే, 2024 ఆగస్టులో రిటైర్ అయిన భాస్కర్ భట్ రూ. 1.33 కోట్ల కమిషన్ అందుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో టాటా సన్స్ కంపెనీ తన లాభాల్లో 24.3 శాతం కోల్పోయింది. లాభాలు రూ. 34,654 కోట్ల నుంచి రూ. 26,232 కోట్లకు పడిపోయినప్పటికీ, టాటా సన్స్ ఛైర్మన్‌కు జీతాన్ని పెంచడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Read also:India UK : మోదీ యూకే పర్యటన: ఎఫ్‌టీఏ, సీఎస్‌పీ బలోపేతంపై దృష్టి

 

Related posts

Leave a Comment