Texas : టెక్సాస్‌ను ముంచెత్తిన వరదలు: 24 మంది మృతి, సమ్మర్ క్యాంప్ బాలికలు గల్లంతు

Tragedy in Texas: Summer Camp Girls Feared Drowned in Massive Floods

Texas : టెక్సాస్‌ను ముంచెత్తిన వరదలు: 24 మంది మృతి, సమ్మర్ క్యాంప్ బాలికలు గల్లంతు:అమెరికాలోని టెక్సాస్‌ను వరదలు ముంచెత్తాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజల జనజీవనం స్తంభించిపోయింది. ఈ ప్రకృతి విపత్తులో ఓ క్రిస్టియన్ సమ్మర్ క్యాంపు నుంచి 20 మందికి పైగా బాలికలు గల్లంతవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

టెక్సాస్ వరదలు: సమ్మర్ క్యాంప్ నుండి గల్లంతైన బాలికలు, పెరిగిన మరణాల సంఖ్య

అమెరికాలోని టెక్సాస్‌ను వరదలు ముంచెత్తాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజల జనజీవనం స్తంభించిపోయింది. ఈ ప్రకృతి విపత్తులో ఓ క్రిస్టియన్ సమ్మర్ క్యాంపు నుంచి 20 మందికి పైగా బాలికలు గల్లంతవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ వరదల్లో ఇప్పటివరకు మొత్తం 24 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.

టెక్సాస్‌లోని హంట్ ప్రాంతంలో ఉన్న గ్వాడాలుపే నది భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. నది ఉప్పొంగడంతో దాని తీరంలో ఏర్పాటు చేసిన ఓ ప్రముఖ క్రిస్టియన్ క్యాంపును వరద నీరు పూర్తిగా ముంచెత్తింది. వేసవి శిక్షణా శిబిరం కోసం అక్కడికి వచ్చిన 23 నుంచి 25 మంది బాలికలు వరద ప్రవాహంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. దీంతో తమ పిల్లల ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చిన్నారుల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కన్నీరుమున్నీరవుతున్నారు.

మరోవైపు, అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. వరదల్లో చిక్కుకున్న సుమారు 200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గల్లంతైన బాలికల కోసం హెలికాప్టర్లు, పడవల సాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు. నది ఉద్ధృతి, ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు ఆటంకంగా మారినట్లు తెలుస్తోంది. భారీ వరదల కారణంగా అనేక నివాసాలు నీట మునిగి, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.

Read also:Trump : అమెరికాలో ట్రంప్ వివాదాస్పద బిల్లు ఆమోదం: పన్ను కోతలు, సైనిక వ్యయం పెంపు

 

Related posts

Leave a Comment