JagdeepDhankhar : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా: రాష్ట్రపతి ముర్ము ఆమోదం

President Droupadi Murmu Accepts Dhankhar's Resignation; PM Modi Lauds Services

JagdeepDhankhar : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా: రాష్ట్రపతి ముర్ము ఆమోదం:ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదించారు. ఆయన రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్రపతి ప్రకటించారు. ఈ మేరకు ధన్‌ఖడ్ రాజీనామాను ఆమోదిస్తూ రాష్ట్రపతి సంతకం చేసిన లేఖను హోంశాఖకు పంపించారు.

అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదించారు. ఆయన రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్రపతి ప్రకటించారు. ఈ మేరకు ధన్‌ఖడ్ రాజీనామాను ఆమోదిస్తూ రాష్ట్రపతి సంతకం చేసిన లేఖను హోంశాఖకు పంపించారు.

సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా, రాజ్యసభ ఛైర్మన్ హోదాలో జగదీప్ ధన్‌ఖడ్ సభ కార్యక్రమాలను సజావుగా నిర్వహించారు. తొలిరోజు కార్యకలాపాలు ముగిసి, సభ మంగళవారానికి వాయిదా పడిన తర్వాత, ధన్‌ఖడ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. అనారోగ్య కారణాల వల్ల ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించి, తక్షణమే ఆమోదించాలని కోరారు.

ప్రధాని నరేంద్ర మోదీ ధన్‌ఖడ్‌ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఉపరాష్ట్రపతిగా, అలాగే ఇతర పదవుల్లోనూ ఆయన ఎంతో సేవలందించారని ప్రధాని ప్రశంసించారు. ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ముర్ము ఆమోదించిన తర్వాత ప్రధాని మోదీ ఈ మేరకు ట్వీట్ చేశారు.

Read also:TGTET : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) ఫలితాలు విడుదల

Related posts

Leave a Comment