HarishRao : కోటి పరిహారం హామీ ఏమైంది? సిగాచీ బాధితుల ఆవేదనపై హరీశ్ రావు

Harish Rao Slams Govt Over Unpaid Compensation to Sigachi Victims

HarishRao : కోటి పరిహారం హామీ ఏమైంది? సిగాచీ బాధితుల ఆవేదనపై హరీశ్ రావు:సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, అయితే రోజులు గడుస్తున్నా ఆ హామీ అమలు కాలేదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు.

సిగాచీ బాధితులకు పరిహారంపై హరీశ్ రావు ఆగ్రహం

సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, అయితే రోజులు గడుస్తున్నా ఆ హామీ అమలు కాలేదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సిగాచీ బాధితులకు ఇప్పటికీ పరిహారం అందకపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ను హరీశ్ రావు కలిశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పరిహారం అందక బాధితులు ఆందోళన చెందుతున్నారని హరీశ్ రావు అన్నారు. “పరిహారం ఎప్పుడు ఇస్తారు?” అని వారు నిలదీస్తున్నారని, అధికారులను కలిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆయన ఆరోపించారు. కొన్ని కుటుంబాలకు కేవలం లక్ష రూపాయలు మాత్రమే పరిహారం అందిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరణించినవారు, గాయపడినవారి వివరాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదని విమర్శించారు. ఎంతమందికి పరిహారం ఇచ్చారో అధికారికంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

Read also:Lokesh : సింగపూర్‌ పర్యటనలో నారా లోకేశ్: వాలంటీర్లతో ముఖాముఖి

 

Related posts

Leave a Comment