ManchuLakshmi : మంచు లక్ష్మిని ఆకట్టుకున్న అల్లు అర్హ

Allu Arha's Cute Conversation with Manchu Lakshmi

ManchuLakshmi : మంచు లక్ష్మిని ఆకట్టుకున్న అల్లు అర్హ:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ తన ముద్దు ముద్దు మాటలతో మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తన వయసుకు మించిన తెలివితేటలతో ఎప్పుడూ ఆకట్టుకునే అర్హ, తాజాగా నటి మంచు లక్ష్మిని అడిగిన ఓ ప్రశ్న వైరల్ అవుతోంది.

తెలుగు అమ్మాయివేనా? అని అడిగిన అర్హ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ తన ముద్దు ముద్దు మాటలతో మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తన వయసుకు మించిన తెలివితేటలతో ఎప్పుడూ ఆకట్టుకునే అర్హ, తాజాగా నటి మంచు లక్ష్మిని అడిగిన ఓ ప్రశ్న వైరల్ అవుతోంది. అర్హ అమాయకత్వానికి, తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మంచు లక్ష్మి ఇటీవల అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఉన్న అర్హతో సరదాగా ముచ్చటిస్తూ, “నన్ను ఏదో అడగాలనుకుంటున్నావంట కదా, ఏంటది?” అని లక్ష్మి అడిగారు. దీనికి అర్హ ఏమాత్రం తడుముకోకుండా, “నువ్వు తెలుగేనా? తెలుగు అమ్మాయివేనా?” అని సూటిగా ప్రశ్నించింది. అర్హ ప్రశ్నతో ఆశ్చర్యపోయిన లక్ష్మి, నవ్వుతూ “నేను తెలుగే పాపా, నీకెందుకు ఆ డౌట్ వచ్చింది?” అని అడిగారు.

దానికి అర్హ బదులిస్తూ, “నీ తెలుగు యాస అలా ఉంది” అని చెప్పడంతో లక్ష్మి మరింత ఆశ్చర్యానికి గురయ్యారు. అర్హ సమాధానానికి మురిసిపోయిన ఆమె, “నీ యాస కూడా అలానే ఉంది కదా” అంటూ నవ్వుతూ బదులిచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన బన్నీ అభిమానులు అర్హ క్యూట్‌నెస్‌కు మురిసిపోతున్నారు.

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, అర్హకు సంబంధించిన వీడియోలను తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అవి ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ బన్నీ అభిమానులను, నెటిజన్లను ఎంతగానో అలరిస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజా వీడియో కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.

Read also:HighCourt : తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు: గర్భిణి బాలికకు అబార్షన్ నిరాకరణ

Related posts

Leave a Comment