China : రష్యాపై ఆంక్షలు విధించే ముందు మీ దేశాన్ని చూసుకోండి: అమెరికాపై చైనా ఫైర్

China Slams US for Hypocrisy on Russia Sanctions

China : రష్యాపై ఆంక్షలు విధించే ముందు మీ దేశాన్ని చూసుకోండి: అమెరికాపై చైనా ఫైర్:చైనా ప్రతినిధి గెంగ్ షువాంగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, రష్యాతో వ్యాపారం చేయవద్దని ఇతర దేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంపై చైనా తీవ్రంగా స్పందించింది. రష్యాతో వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న దేశాలపై భారీగా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ పదే పదే హెచ్చరించడంపై గెంగ్ షువాంగ్ మండిపడ్డారు.

రష్యాతో వాణిజ్యం: అమెరికాను నిలదీసిన చైనా.. “మీరు చేస్తే ఒప్పా?” అంటూ ప్రశ్నించిన గెంగ్ షువాంగ్

చైనా ప్రతినిధి గెంగ్ షువాంగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, రష్యాతో వ్యాపారం చేయవద్దని ఇతర దేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంపై చైనా తీవ్రంగా స్పందించింది. రష్యాతో వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న దేశాలపై భారీగా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ పదే పదే హెచ్చరించడంపై గెంగ్ షువాంగ్ మండిపడ్డారు.

ఇతరులు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పా?” అంటూ అమెరికాను చైనా శాశ్వత ప్రతినిధి గెంగ్ షువాంగ్ ఐక్యరాజ్యసమితిలో ప్రశ్నించారు. మిగతా దేశాల కంటే అమెరికానే రష్యాతో ఎక్కువగా వ్యాపారం చేస్తోందని ఆయన ఆరోపించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను షువాంగ్ ఖండించారు.

తాము ఉక్రెయిన్ లేదా రష్యాకు ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయలేదని షువాంగ్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా ప్రతినిధి చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి తాము రష్యాతో సాధారణ వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నామని, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని వివరించారు. ఇతరులపై నిందలు వేసి నిందించడం మానుకోవాలని అమెరికాకు షువాంగ్ హితవు పలికారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలకడానికి, రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు కృషి చేయాలని ట్రంప్‌కు ఆయన సూచించారు.

Read also:AnilAmbani : అనిల్ అంబానీకి ఈడీ షాక్: రూ. 17 వేల కోట్ల కేసులో సమన్లు

 

Related posts

Leave a Comment