Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు

Chiranjeevi's Grand Birthday Celebrations in Goa

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు:నేడు మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న కుటుంబంతో క‌లిసి గోవాలో బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటున్నారు. ఈ వేడుకలు ఎంతో ఘనంగా, సంతోషంగా జరుగుతున్నాయి.

గోవాలో ఘనంగా చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్

నేడు మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న కుటుంబంతో క‌లిసి గోవాలో బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటున్నారు. ఈ వేడుకలు ఎంతో ఘనంగా, సంతోషంగా జరుగుతున్నాయి. చిరంజీవికి అభిమానులు, సినీ, రాజకీయ, ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌న్మ‌దిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

ఈ సందర్భంగా చిరు త‌న‌యుడు రామ్ చరణ్ త‌న తండ్రికి ప్ర‌త్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో రామ్ చరణ్ త‌న తండ్రికి కేక్ తినిపిస్తూ, చిరు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకోవ‌డం చూడొచ్చు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. చిరు కూడా రామ్ చరణ్‌కు కేక్ తినిపిస్తూ త‌న కుమారుడిపై త‌న‌కున్న ప్రేమ‌ని తెలియ‌జేశారు. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. మెగా అభిమానులు ఈ వీడియోను పెద్దఎత్తున షేర్ చేస్తూ, మెగాస్టార్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

Read also:BCCI : బీసీసీఐ సెలక్షన్ కమిటీలలో మార్పులు: కొత్తవారికి ఆహ్వానం

 

Related posts

Leave a Comment