Narayana : మంత్రి నారాయణ అల్లుడి కంపెనీని మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు అరెస్ట్

Cyber fraudsters who cheated Minister Narayana's son-in-law's company arrested

Narayana : మంత్రి నారాయణ అల్లుడి కంపెనీని మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు అరెస్ట్:ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కంపెనీని లక్ష్యంగా చేసుకుని, ఏకంగా రూ. 1.40 కోట్లు కాజేసిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే, మంత్రి నారాయణ అల్లుడు పునీత్ పేరుతో ఆ కంపెనీ అకౌంటెంట్‌కు సైబర్ నేరగాళ్లు ఒక మెసేజ్ పంపించారు.

మంత్రి నారాయణ అల్లుడి కంపెనీని మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కంపెనీని లక్ష్యంగా చేసుకుని, ఏకంగా రూ. 1.40 కోట్లు కాజేసిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే, మంత్రి నారాయణ అల్లుడు పునీత్ పేరుతో ఆ కంపెనీ అకౌంటెంట్‌కు సైబర్ నేరగాళ్లు ఒక మెసేజ్ పంపించారు. అత్యవసరంగా డబ్బు అవసరమని, వెంటనే తాను చెప్పిన బ్యాంకు ఖాతాకు రూ. 1.40 కోట్లు బదిలీ చేయాలని ఆ మెసేజ్‌లో కోరారు.

అకౌంటెంట్ ఆ మెసేజ్‌ను నిజమని నమ్మి, ఏమాత్రం ఆలోచించకుండా వారు చెప్పిన ఖాతాకు డబ్బును బదిలీ చేశారు. అయితే, కొద్దిసేపటి తర్వాత తాను మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితులైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజీవ్, అరవింద్ అనే ఇద్దరు వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేశారు.

Read also:India-China : భారత్-చైనా సరిహద్దు వాణిజ్యం పునఃప్రారంభం: ఐదేళ్ల తర్వాత కీలక నిర్ణయం

 

Related posts

Leave a Comment