AP : ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు శాశ్వత న్యాయమూర్తులు: ప్రమాణ స్వీకారం:ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు కొత్త శాశ్వత న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో అదనపు న్యాయమూర్తులుగా పనిచేసిన జస్టిస్ హరినాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి మండవ, జస్టిస్ సుమతి జగడం, మరియు జస్టిస్ న్యాపతి విజయ్ లను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు శాశ్వత న్యాయమూర్తులు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు కొత్త శాశ్వత న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో అదనపు న్యాయమూర్తులుగా పనిచేసిన జస్టిస్ హరినాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి మండవ, జస్టిస్ సుమతి జగడం, మరియు జస్టిస్ న్యాపతి విజయ్ లను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.
ఆదేశాల ప్రకారం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆ నలుగురిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో హైకోర్టులోని ఇతర న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్, బార్ కౌన్సిల్ మరియు బార్ అసోసియేషన్ సభ్యులతో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
Read also:Telangana : హైదరాబాద్లో బంగ్లాదేశీయుల అక్రమ నివాసం: బీఎస్ఎఫ్కు అప్పగింత
