Karnataka : ప్రభుత్వ ఉద్యోగి అక్రమాస్తులు: ₹30 కోట్ల సంపాదన:నెలకు కేవలం ₹15 వేల జీతంతో రిటైర్ అయిన ప్రభుత్వ గుమస్తా కలకప్ప నిడగుండి ఆస్తులు చూసి అధికారులు షాక్ అయ్యారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన ఈయన, తక్కువ జీతం ఉన్నప్పటికీ సుమారు ₹30 కోట్ల విలువైన అక్రమాస్తులు పోగేశాడు.
ప్రభుత్వ ఉద్యోగి అక్రమాస్తులు
నెలకు కేవలం ₹15 వేల జీతంతో రిటైర్ అయిన ప్రభుత్వ గుమస్తా కలకప్ప నిడగుండి ఆస్తులు చూసి అధికారులు షాక్ అయ్యారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన ఈయన, తక్కువ జీతం ఉన్నప్పటికీ సుమారు ₹30 కోట్ల విలువైన అక్రమాస్తులు పోగేశాడు. కొప్పల్లో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్లో గుమస్తాగా పనిచేసి రిటైర్ అయిన కలకప్ప ఇంట్లో లోకాయుక్త అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు ఈ భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆయనకు 24 ఇళ్లు, 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అంతేకాకుండా, ఆయన భార్య మరియు సోదరుడి పేరుతో కూడా ఆస్తులు ఉన్నట్లు తేలింది. ఇంట్లో 350 గ్రాముల బంగారం, 1.5 కిలోల వెండి ఆభరణాలు, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.కలకప్ప, ఇంజినీర్ జెడ్.ఎం.చిన్చోల్కర్తో కలిసి నకిలీ పత్రాలు, బిల్లులు సృష్టించి ₹72 కోట్లకు పైగా నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగానే లోకాయుక్త అధికారులు దాడులు నిర్వహించారు.
Read also:DrNamratha : సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ నమ్రత అరెస్టు: అసలు ఏమైంది?
