KhazanaJewellery : చందానగర్ ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసు చేధించిన పోలీసులు:హైదరాబాద్లోని చందానగర్ ఖజానా జ్యువెలరీలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇందులో ఒకరిని పుణెలో, మరో ఇద్దరిని బీదర్లో పట్టుకున్నారు. నిందితులు ముగ్గురు కూడా బిహార్ రాష్ట్రానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
ఖజానా జ్యువెలరీ చోరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
హైదరాబాద్లోని చందానగర్ ఖజానా జ్యువెలరీలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇందులో ఒకరిని పుణెలో, మరో ఇద్దరిని బీదర్లో పట్టుకున్నారు. నిందితులు ముగ్గురు కూడా బిహార్ రాష్ట్రానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 12న చందానగర్లోని ఖజానా జ్యువెలరీలో దోపిడీ జరిగింది.
ముసుగులు ధరించిన దుండగులు జ్యువెలరీలోని సిబ్బందిపై కాల్పులు జరిపి, చోరీకి పాల్పడి పారిపోయారు.పోలీసుల విచారణలో నిందితులు నెల రోజుల క్రితం బిహార్ నుంచి వచ్చి జగద్గిరిగుట్టలో మకాం వేసి, ఒక గ్లాస్ పరిశ్రమలో పనిచేస్తున్నట్లు తెలిసింది. వీరు కొద్ది రోజులు రెక్కీ నిర్వహించిన తర్వాత చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అరెస్టు చేశారు.
Read also:DriverlessBuses : డ్రైవర్ అవసరం లేని బస్సులు: హైదరాబాద్ ఐఐటీలో సరికొత్త ప్రయాణ అనుభవం
