RahulGandhi : పోలీసుల అదుపులో ఇండియా కూటమి ఎంపీలు: ఢిల్లీలో ఉద్రిక్తత:పార్లమెంట్ భవనం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళుతున్న ప్రతిపక్ష కూటమి ఎంపీలను పోలీసులు నిలిపివేశారు. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సహా కీలక నాయకులను అరెస్టు చేసి ప్రత్యేక బస్సులలో పోలీస్ స్టేషన్కు తరలించారు.
పోలీసుల అదుపులో ఇండియా కూటమి ఎంపీలు
పార్లమెంట్ భవనం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళుతున్న ప్రతిపక్ష కూటమి ఎంపీలను పోలీసులు నిలిపివేశారు. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సహా కీలక నాయకులను అరెస్టు చేసి ప్రత్యేక బస్సులలో పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ అరెస్టుల నేపథ్యంలో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
లోక్ సభ ఎన్నికలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ఇండియా కూటమి నాయకులు, ఈ అవకతవకలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచేందుకు ఈ రోజు ప్రతిపక్ష కూటమి ఎంపీలంతా ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి మార్చ్ నిర్వహించేందుకు ప్రయత్నించగా, పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు.
సంసద్ మార్గ్ను మూసివేశారు. ఎన్నికల సంఘంతో భేటీకి 30 మందికి మాత్రమే అనుమతిస్తామని పోలీసులు ప్రకటించారు. అయితే, అందరం కలిసే వెళతామని ఇండియా కూటమి ఎంపీలు పట్టుబట్టారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఇండియా కూటమి ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు.
Read also:TCS : టీసీఎస్లో ఉద్యోగాల కోత, ఐటీ రంగంలో ఏఐ ప్రభావం
