Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి:ఈరోజు భారతీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ నేపథ్యంలో, అలాగే వరుసగా మూడు రోజులు మార్కెట్లకు సెలవుల కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
మార్కెట్లపై ట్రంప్-పుతిన్ భేటీ ప్రభావం
ఈరోజు భారతీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ నేపథ్యంలో, అలాగే వరుసగా మూడు రోజులు మార్కెట్లకు సెలవుల కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 57 పాయింట్లు పెరిగి 80,597 వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు పెరిగి 24,631 వద్ద స్థిరపడ్డాయి. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 87.57గా ఉంది.
లాభపడిన షేర్లు: ఇన్ఫోసిస్, ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్.
నష్టపోయిన షేర్లు: అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, బీఈఎల్.
Read also:HighCourt : ఏపీ హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ: పులివెందుల, ఒంటిమిట్ట రీపోలింగ్ పిటిషన్ కొట్టివేత
