Kadapa : కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్: ఒంటిమిట్టలో టీడీపీ ఆధిక్యం, పులివెందులలో కొనసాగుతున్న లెక్కింపు:కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. పులివెందుల, ఒంటిమిట్ట స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కడపలో భారీ పోలీసు బందోబస్తు మధ్య కౌంటింగ్ జరుగుతోంది.
కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్
కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. పులివెందుల, ఒంటిమిట్ట స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కడపలో భారీ పోలీసు బందోబస్తు మధ్య కౌంటింగ్ జరుగుతోంది.తాజాగా ఒంటిమిట్ట తొలి రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. తొలి రౌండ్ లో వైఎస్సార్సీపీకి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి 4,632 ఓట్లు సాధించి, పూర్తి ఆధిక్యతను ప్రదర్శించారు.
వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి కేవలం 1,211 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో తొలి రౌండ్ లో టీడీపీ అభ్యర్థి 3,421 ఓట్ల ఆధిక్యత సాధించారు.పులివెందుల జడ్పీటీసీ కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. అక్కడ ఒక్క రౌండ్ లోనే ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఒంటిమిట్ట కౌంటింగ్ మాత్రం మూడు రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ రెండు స్థానాల్లోనూ తమదే గెలుపు అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
