Kerala : కేరళ మిస్సింగ్ లేడీస్ కేసు: రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇంట్లో బయటపడిన రహస్యం

Kerala Missing Women Case: The Secret Uncovered in a Real Estate Broker's Home

Kerala : కేరళ మిస్సింగ్ లేడీస్ కేసు: రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇంట్లో బయటపడిన రహస్యం:కేరళలో సంచలనం సృష్టించిన ఓ ఘటనలో, రియల్ ఎస్టేట్ బ్రోకర్‌కు చెందిన ఇంటి ఆవరణలో పోలీసులకు కాలిన స్థితిలో ఉన్న ఓ పుర్రె, పదికి పైగా ఎముకల భాగాలు లభించాయి. ఓ మహిళ అదృశ్యం కేసు దర్యాప్తులో భాగంగా జరిపిన తవ్వకాల్లో ఈ భయానక దృశ్యాలు బయటపడ్డాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

కేరళ మిస్సింగ్ లేడీస్ కేసు

కేరళలో సంచలనం సృష్టించిన ఓ ఘటనలో, రియల్ ఎస్టేట్ బ్రోకర్‌కు చెందిన ఇంటి ఆవరణలో పోలీసులకు కాలిన స్థితిలో ఉన్న ఓ పుర్రె, పదికి పైగా ఎముకల భాగాలు లభించాయి. ఓ మహిళ అదృశ్యం కేసు దర్యాప్తులో భాగంగా జరిపిన తవ్వకాల్లో ఈ భయానక దృశ్యాలు బయటపడ్డాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

అలప్పుజా జిల్లాలోని చెర్తలకు సమీపంలో నివసించే 68 ఏళ్ల రియల్ ఎస్టేట్ బ్రోకర్ సీఎం సెబాస్టియన్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఎట్టమనూర్‌కు చెందిన 65 ఏళ్ల జైన్ మాథ్యూ అలియాస్ జైనమ్మ అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే సెబాస్టియన్ ఇంటి వద్ద సోదాలు నిర్వహించారు. గత నెల 28న జరిపిన తవ్వకాల్లో ఓ పుర్రె, తొడ ఎముక, కత్తిరించిన దంతం దొరికాయి. తాజాగా, అదే ప్రాంతంలో మరోసారి తవ్వకాలు జరపగా, పదికి పైగా కాలిన ఎముకల ముక్కలు లభించాయి.

ఈ కేసు కేవలం జైనమ్మ అదృశ్యానికే పరిమితం కాలేదు. బిందు పద్మనాభన్, ఐషా అనే మరో ఇద్దరు మహిళల అదృశ్యం కేసులతో కూడా సెబాస్టియన్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు వేర్వేరు క్రైమ్ బ్రాంచ్ బృందాలు అతడిని సుదీర్ఘంగా విచారించాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, సెబాస్టియన్ ఈ ముగ్గురు మహిళలు తనకు తెలుసని, వారితో ఆర్థిక లావాదేవీలు కూడా జరిగాయని అంగీకరించాడు. అయితే, వారేమయ్యారు అనే విషయంపై మాత్రం నోరు విప్పడం లేదని తెలిసింది.

నిందితుడి రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలంలో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. భూమి లోపల ఏమైనా అవశేషాలు ఉన్నాయేమో గుర్తించేందుకు గ్రౌండ్-పెనెట్రేటింగ్ రాడార్, జాగిలాలను సైతం ఉపయోగిస్తున్నారు. ఇంటి ఆవరణలోని చెరువును ఖాళీ చేయగా, ఒక సంచి, చీర ముక్క, కొన్ని దుస్తుల అవశేషాలు లభించాయి. ఇంట్లోని పాత సెప్టిక్ ట్యాంక్‌ను కూడా తనిఖీ చేసినా ఏమీ దొరకలేదు. సెబాస్టియన్ కస్టడీ గడువు ముగిసేలోపు కీలక ఆధారాలు సేకరించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.

Read also:Stock Market : స్టాక్ మార్కెట్లు: స్వల్ప నష్టాలు

 

Related posts

Leave a Comment