gold Rate : బంగారం, వెండి ధరల తాజా హెచ్చుతగ్గులు: శ్రావణమాసంలో పెరిగిన డిమాండ్:శ్రావణ మాసంలో పసిడి, వెండి ధరలు పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం, వెండికి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్న కొంత తగ్గిన బంగారం ధర ఈరోజు మళ్ళీ భారీగా పెరిగింది.
బంగారం, వెండి ధరల తాజా హెచ్చుతగ్గులు
శ్రావణ మాసంలో పసిడి, వెండి ధరలు పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం, వెండికి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్న కొంత తగ్గిన బంగారం ధర ఈరోజు మళ్ళీ భారీగా పెరిగింది. వెండి ధర కూడా షాకిస్తోంది.
ఈరోజు 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర $820 పెరిగి $102,220కి చేరింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర $750 పెరిగి $93,700 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర $76,700 వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి ధర కూడా భారీగా పెరిగింది. గత వారం నిలకడగా ఉన్న వెండి ధర, ఈరోజు $2000 పెరిగి కిలో $115,000కి చేరింది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్ కతాలో కూడా ఇదే ధర ఉంది. చెన్నైలో మాత్రం కిలో వెండి ధర మరో $10,000 ఎక్కువగా ఉంది.
Read Alao:VandeBharat : వందే భారత్ స్లీపర్ రైలు: సెప్టెంబర్ నెలలో తొలి రైలు ప్రారంభం
