Jagan : జగన్కు రాజ్నాథ్ సింగ్ ఫోన్: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోరిన కేంద్రం:ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫోన్ చేశారు.
జగన్కు రాజ్నాథ్ సింగ్ ఫోన్
ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫోన్ చేశారు. రానున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని, తద్వారా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని ఆయన కోరారు.
కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై జగన్ పరోక్షంగా విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ ఫోన్ కాల్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ తమ అభ్యర్థిగా రాధాకృష్ణన్ను ప్రకటించి, ఆయన ఏకగ్రీవ ఎన్నిక కోసం ఇతర పార్టీల మద్దతు కూడగడుతోంది. ఈ క్రమంలోనే రాజ్నాథ్ సింగ్ స్వయంగా జగన్తో మాట్లాడారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలతో కలిసి కూటమిగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తమ రాజకీయ ప్రత్యర్థులతో కలిసి ఉన్న బీజేపీకి జగన్ మద్దతు ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
Read also:OperationSindoor : ఆపరేషన్ సిందూర్: పాకిస్థాన్ నౌకాదళం భయం
