Tamannaah : తమన్నా, అబ్దుల్ రజాక్ ల పెళ్లి వార్తలు.. స్పందించిన హీరోయిన్

Tamannaah Bhatia Responds to Rumours of Her Marriage with Abdul Razzaq

Tamannaah : తమన్నా, అబ్దుల్ రజాక్ ల పెళ్లి వార్తలు.. స్పందించిన హీరోయిన్:ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలపై రూమర్స్ అధికమవుతున్న విషయం విదితమే. సినీ పరిశ్రమలోని నటీనటులు, క్రికెట్ క్రీడాకారులు ఎక్కడైనా కలవడమో లేదా సన్నిహితంగా కనిపించడమో జరిగితే చాలు, వారిపై సోషల్ మీడియాలో రూమర్స్ సృష్టించడం, గాసిప్ కథనాలు ప్రచారం చేయడం సాధారణమైపోయింది.

నాపై వస్తున్న రూమర్స్ అన్నీ అబద్ధాలే.. తమన్నా

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలపై రూమర్స్ అధికమవుతున్న విషయం విదితమే. సినీ పరిశ్రమలోని నటీనటులు, క్రికెట్ క్రీడాకారులు ఎక్కడైనా కలవడమో లేదా సన్నిహితంగా కనిపించడమో జరిగితే చాలు, వారిపై సోషల్ మీడియాలో రూమర్స్ సృష్టించడం, గాసిప్ కథనాలు ప్రచారం చేయడం సాధారణమైపోయింది. కేవలం వ్యూస్ కోసం సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు, రూమర్లు నిత్యకృత్యంగా మారాయి.

ఈ క్రమంలోనే, నటి తమన్నా భాటియా పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్‌పై తాజాగా తమన్నా ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. తనపై వస్తున్న రూమర్లను ఆమె ఖండిస్తూ, సోషల్ మీడియాలోనే ఇలాంటి గాసిప్స్ సృష్టించబడుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

ఒక నగల దుకాణం ప్రారంభోత్సవానికి అబ్దుల్‌ రజాక్ తో కలిసి హాజరైన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అంతకు మించి ఏమీ లేదని స్పష్టం చేశారు. అలాగే, విరాట్ కోహ్లీతో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు వచ్చిన రూమర్స్‌పై కూడా తమన్నా స్పందించారు. తాను విరాట్‌ను ఒకసారి మాత్రమే కలిశానని, ఆ సమయం నుంచి ఇలాంటి ప్రచారం జరగడం బాధ కలిగించిందని అన్నారు. ఆ తర్వాత మళ్లీ కోహ్లీని కలుసుకోలేదని తమన్నా తేల్చి చెప్పారు.

Read also:Yemen : యెమెన్ తీరంలో ఘోర విషాదం: ఇథియోపియా వలసదారుల పడవ మునిగి 68 మంది మృతి

 

Related posts

Leave a Comment