sabitha Indra Reddy : ఓబుళాపురం మైనింగ్ కేసు: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు:ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డికి మరియు మాజీ ఐఏఎస్ కృపానందానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరిద్దరిని గతంలో నాంపల్లి సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
సబితా ఇంద్రారెడ్డికి నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డికి మరియు మాజీ ఐఏఎస్ కృపానందానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరిద్దరిని గతంలో నాంపల్లి సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సబితా ఇంద్రారెడ్డి, కృపానందన్లను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
ఈ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు మే నెలలో ఐదుగురిని దోషులుగా ప్రకటించింది. గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్తో సహా నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష మరియు రూ. 10 వేల చొప్పున జరిమానా విధించింది. అలాగే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి రూ. 2 లక్షల జరిమానా విధించింది.
Read also:AP : ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు: ప్రభుత్వం అప్రమత్తం
