Upasana : ఉపాసనకు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్ పదవి:
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్గా ఉపాసన
ఎక్స్ వేదికగా ఉపాసన స్పందిస్తూ… సీఎం రేవంత్ కు థ్యాంక్స్ చెప్పారు. సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేసే అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు వేణుగోపాలాచారి, క్రీడలు, యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కు ధన్యవాదాలు తెలిపారు.
క్రీడారంగంలో రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025’ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణను రూపొందించింది. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘తెలంగాణ స్పోర్ట్స్ హబ్’కు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసనను కో-ఛైర్మన్గా నియమించారు. ఈ సంస్థకు ఛైర్మన్గా సంజీవ్ గోయెంకా వ్యవహరించనున్నారు.
ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఈ సందర్భంగా ఉపాసన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపారు. సంజీవ్ గోయెంకా వంటి ప్రముఖుడితో కలిసి పనిచేసే అవకాశం రావడం గర్వంగా ఉందని ఆమె అన్నారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు వేణుగోపాలాచారి, క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్లకు కూడా ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.క్రీడారంగాన్ని ప్రోత్సహించడానికి, రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని పెంచడానికి ‘తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025’ని ప్రభుత్వం రూపొందించింది. ఇందులో భాగంగానే ‘స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ’ను ఏర్పాటు చేసింది.
Read also:SridharVembu : విదేశీ విద్య: అప్పులు చేసేటప్పుడు జాగ్రత్త!
