-
వీధి మొదట్లో రాత్రికి రాత్రే వెలిసిన ఆరు నేమ్ బోర్డులు
-
మొత్తం 25 ఇళ్లు మాత్రమే ఉన్నా కాలనీకి ఆరు పేర్లు
-
నాడు “వినాయక నగర్”.. నేడు కులం పేర్లతో కొత్త బోర్డులు
సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని వినాయక నగర్ కాలనీలో కుల వివాదం కొత్త రూపు దాల్చింది. రాత్రికి రాత్రే కాలనీ ప్రవేశద్వారం వద్ద ఆరు నేమ్ బోర్డులు ఏర్పాటు చేయడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మొత్తం 25 ఇళ్లే ఉన్న ఈ కాలనీని ప్రారంభంలో “వినాయక నగర్” అని పిలిచేవారు. అయితే, ఇటీవల చోటుచేసుకున్న వివాదం కారణంగా కుల విభేదాలు బయటపడ్డాయి.
ఇక్కడి కుటుంబాల్లో 70 శాతం ఒకే సామాజిక వర్గానికి చెందినవారే ఉండగా, మిగతా 30 శాతం ఇతర వర్గాలకు చెందినవారు ఉన్నారు. మెజార్టీ వర్గం తమ కులం పేరుతో బోర్డు పెట్టగా, దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిన ఇతర వర్గాలు కూడా వెనుకాడకుండా తమ తమ కుల పేర్లతో బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు.
ఫలితంగా, “రెడ్డి ఎన్ క్లేవ్, ఆర్యవైశ్య ఎన్ క్లేవ్, ముదిరాజ్ ఎన్ క్లేవ్, విశ్వకర్మ ఎన్ క్లేవ్, యాదవ్స్ ఎన్ క్లేవ్” వంటి పేర్లతో బోర్డులు నిలిచాయి. వీధి మొదట్లో వరుసగా ఆరు నేమ్ బోర్డులు ఉండటం పట్టణంలో పెద్ద చర్చకు దారితీసింది.
Read : Kavitha : తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కవిత వ్యూహం
