Garudavega : అమెరికా ‘డి మినిమిస్ రూల్’ రద్దు: USAకి తన సేవలను కొనసాగిస్తున్న గరుడవేగ:ప్రెస్ నోట్: అంతర్జాతీయ లాజిస్టిక్స్ మరియు క్రాస్-బోర్డర్ షిప్పింగ్లో విశ్వసనీయమైన సంస్థ గరుడవేగ – నెక్స్జెన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, 2025 ఆగస్టు 29 నుండి అమల్లోకి వచ్చిన డి మినిమిస్ రూల్ రద్దు తర్వాత సవరించిన అమెరికా కస్టమ్స్ మార్గదర్శకాలను అనుసరిస్తూ USAకి తన షిప్పింగ్ సేవలను కొనసాగించనున్నట్లు ప్రకటించింది.
గరుడవేగ నుండి ముఖ్య ప్రకటన: USA షిప్పింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి
ప్రెస్ నోట్: అంతర్జాతీయ లాజిస్టిక్స్ మరియు క్రాస్-బోర్డర్ షిప్పింగ్లో విశ్వసనీయమైన సంస్థ గరుడవేగ – నెక్స్జెన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, 2025 ఆగస్టు 29 నుండి అమల్లోకి వచ్చిన డి మినిమిస్ రూల్ రద్దు తర్వాత సవరించిన అమెరికా కస్టమ్స్ మార్గదర్శకాలను అనుసరిస్తూ USAకి తన షిప్పింగ్ సేవలను కొనసాగించనున్నట్లు ప్రకటించింది.
చట్టబద్ధంగా నడిచే సంస్థగా గరుడవేగ, అమెరికా కస్టమ్స్ నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా ఉండటమే కాకుండా, ప్రతి పార్సెల్ కొత్త విధానాలకు కచ్చితంగా అనుసరించేలా కట్టుబడి ఉంది. కస్టమర్లు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు USAకి పార్సెల్లు పంపేటప్పుడు సవరించిన మార్గదర్శకాలను జాగ్రత్తగా పాటించాలని సూచించబడుతున్నారు.
ఈ పరిణామంపై సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, “మా కస్టమర్లందరికీ హామీ ఇస్తున్నాం – USAకి మా సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి. కొత్త నిబంధనలు కొన్ని అదనపు అవసరాలను తీసుకువచ్చినా, గరుడవేగ వాటిని పూర్తిగా అనుసరిస్తోంది. అన్ని కస్టమర్లకు సహాయం అందించేందుకు మా సిబ్బంది మరియు బ్రాంచ్ కార్యాలయాలు సిద్ధంగా ఉన్నాయి. షిప్మెంట్ల ప్రాసెసింగ్ సాఫీగా సాగేందుకు మేము పూర్తి స్థాయి మార్గనిర్దేశం అందిస్తాము” అని తెలిపారు.
మరిన్ని వివరాల కోసం దయచేసి సంప్రదించండి:
గరుడవేగ – నెక్స్జెన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెబ్సైట్: www.garudavega.com కస్టమర్ కేర్: +91 9059958342
Read also:ChandrababuNaidu : నారా చంద్రబాబు నాయుడు: 30 ఏళ్ల ముఖ్యమంత్రి ప్రస్థానం
