-
నవరాత్రుల తొలిరోజే 11,000 కార్లు అమ్మిన హ్యూండాయ్
-
గత ఐదేళ్లలో ఇదే అత్యధిక సింగిల్ డే అమ్మకం
-
పండగ సీజన్ ప్రారంభంతో పెరిగిన కొనుగోళ్లు
పండగ సీజన్ ఆటోమొబైల్ రంగానికి భారీ ఊపునిచ్చింది. నవరాత్రుల మొదటి రోజున, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఏకంగా 11,000 కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది. గత ఐదేళ్లలో ఒకే రోజులో ఇంత పెద్ద సంఖ్యలో కార్లు అమ్ముడుపోవడం ఇదే తొలిసారి.
ఈ విజయంపై హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) హోల్-టైమ్ డైరెక్టర్, సీఓఓ అయిన తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, “నవరాత్రులు, జీఎస్టీ సంస్కరణల కారణంగా మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. అందుకే నవరాత్రుల మొదటి రోజే 11,000 కార్ల డీలర్ బిల్లింగ్లు జరిగాయి. గత ఐదేళ్లలో ఒకే రోజులో మాకు ఇదే అత్యుత్తమ అమ్మకాలు” అని తెలిపారు.
హ్యుందాయ్ తో పాటు, ఇతర కార్ల తయారీ కంపెనీలు కూడా జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు పూర్తిగా బదిలీ చేస్తున్నాయి. అంతేకాకుండా, అమ్మకాలను పెంచుకునేందుకు అదనపు డిస్కౌంట్లు, ప్రత్యేక ఎడిషన్ వాహనాలను కూడా విడుదల చేస్తున్నాయి.
Read also : IndiaInSpace : భారత ఉపగ్రహానికి పెను ప్రమాదం: స్పేస్ సెక్యూరిటీపై భారత్ దృష్టి
