Ileana : రెండో బిడ్డ పుట్టాక ఎదురైన మానసిక సంఘర్షణ

Ileana Opens Up About Postpartum Mental Health Struggles
  • రెండో ప్రసవానంతర అనుభవాలను పంచుకున్న నటి ఇలియానా

  • మానసికంగా చాలా గందరగోళానికి గురయ్యానని వెల్లడి

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి ఇలియానా, ప్రస్తుతం తన మాతృత్వపు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. గతేడాది మైఖేల్ డోలన్‌ను పెళ్లి చేసుకున్న ఆమె, ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు. రెండో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఎదురైన మానసిక సవాళ్లను ఇలియానా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

రెండో బిడ్డ పుట్టాక తీవ్రమైన ఒంటరితనం, మానసిక గందరగోళం ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు. విదేశాల్లో ఉండటం, స్నేహితులు అందుబాటులో లేకపోవడంతో ముంబైని, అక్కడి స్నేహితుల మద్దతును బాగా మిస్సయ్యానని ఇలియానా తెలిపారు. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని పిల్లల పెంపకానికే కేటాయిస్తున్నానని, వారు పెద్దయ్యాక తిరిగి సినిమాల్లోకి వస్తానని ఆమె అన్నారు. కుటుంబంతో గడిపే ప్రతి క్షణం ఎంతో ప్రత్యేకమైనదని ఇలియానా పేర్కొన్నారు.

Read also : WaqfAct : వక్ఫ్ చట్టం-2025పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు: ఒక కీలక నిబంధన రద్దు, పూర్తి స్టేకు నిరాకరణ.

 

Related posts

Leave a Comment